రాష్ట్రానికి మరో ఎక్స్‌ప్రెస్ వే.. జర్నీ చాలా తక్కువ
చెన్నై-బెంగళూరు మధ్య కేంద్ర భూఉపరితల రవాణాశాఖ నిర్మించిన నాలుగు లైన్ల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ రహదారి సిద్ధమైంది. దీని నిర్మాణానికి రూ.17,930 కోట్ల వ్యయమైంది. 2024 ఏడాది చివరలో దీన్ని ప్రారంభించబోతున్నారు. ఈ రెండు మెట్రోపాలిటన్ నగరాల మధ్య 262 కిలోమీటర్ల దూరం రహదారిని నిర్మించగా, బెంగళూరు నుంచి కర్ణాటక సరిహద్దు వరకు 110 కిలోమీటర్లు ఉంది. అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడులోకి ప్రవేశిస్తుంది. ఈ రహదారిని ఉపయోగించి కేవలం ఐదు గంటల్లోనే చెన్నై నుంచి బెంగళూరు చేరుకోవచ్చు.
ఇరువైపులా పారిశ్రామిక వాడలు
ఈ ఎక్స్ ప్రెస్ వేకు ఇరువైపులా ఇండస్ట్రియల్ టౌన్ షిప్స్ రాబోతున్నాయి. ప్రస్తుతం బెంగళూరు రూరల్ జిల్లాలో టమక, ముళబాగిలు, కోలారు, నరసాపుర ఇండస్ట్రియల్ టౌన్ షిప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఐదు గంటల్లో ఈ ప్రధాన నగరాల మధ్య ప్రయాణం తగ్గుతుండటంతో ఇండస్ట్రియల్ టౌన్ షిప్స్ బాగా వృద్ధి చెందుతాయని కేంద్రం అభిప్రాయపడుతోంది. అలాగే హోసకోట ఔట్ స్కర్ట్స్ నుంచి దేవనహళ్లి, హోసూరు, తుమకూరు తదితర పట్టణాలకు వెళ్లేందుకు వీలుగా రింగ్ రోడ్ ఫ్లైఓవర్లు నిర్మించారు. బెంగళూరు నుంచి చెన్నైకి బయలుదేరి ఏ వాహనం ఆగకుండా నేరుగా వెళ్లేలా ఈ రహదారిని అభివృద్ధి చేశారు.

గంటకు 120 కిలోమీటర్ల వేగంతో
అలాగే కోలారు, చిత్తూరు ప్రాంతాలతోపాటు ఇండస్ట్రియల్ టౌన్ షిప్స్ నుంచి నేరుగా కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు వెళ్లొచ్చు. దీనివల్ల ఇంధనం ఆదా అవడంతోపాటు సమయం కూడా ఆదా అవుతుందని అధికారులు తెలిపారు. భారతమాల ప్రాజెక్టు కింద కేంద్రం దీన్ని నిర్మించింది. ఈ రెండు నగరాల మధ్య 80 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. ట్రక్ బేలు, వాహనాలు, జంతువుల కోసం అండర్ పాస్ లు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఈ రహదారి పొడవునా బాగా వృద్ధి చెందుతుందనే అంచనాలున్నాయి.












Click it and Unblock the Notifications