వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్యాంకు ఉద్యోగుల ముందుచూపునకు సలాం: కౌంటర్ల వద్దకు రాకూండా..తాడు కట్టి మరీ..!

|
Google Oneindia TeluguNews

అమరావతి: ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న ఒకే ఒక్క పేరు కరోనా వైరస్. చైనాలోని వుహాన్‌లో జన్మించిన ఈ మహమ్మారి ప్రస్తుతం ప్రపంచాన్ని చుట్టుముట్టేసింది. కరోనా వైరస్ సోకని దేశమంటూ ప్రస్తుతం ఏదీ లేదనే చెప్పుకోవచ్చు. దాదాపు అన్ని దేశాల్లో కూడా కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ వైరస్ జాడలు లేని దేశాల సంఖ్యను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. మనదేశం గానీ, మన రాష్ట్రం గానీ దీనికి మినహాయింపేమీ కాదు.

ఈ వైరస్ బారిన పడకుండా ఉండాలంటే.. కొన్ని రకాల ముందుజాగ్రత్తలను తీసుకోవడమే మంచిదంటై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. వైరస్ సోకిన తరువాత చికిత్స తీసుకోవడం కంటే అది సోకకుండా ఉండేలా జాగ్రత్త పడమని స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎవరికి తోచిన విధంగా వారు వైరస్‌ను కట్టడి చేయడానికి తమవంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. జనసమ్మర్థం అధికంగా ఉండే కార్యాలయాల్లో బ్యాంకులు కూడా ఒకటి.

Bank employees taking precautionary measures due to Coronavirus outbreak

Recommended Video

కరోనా Thermal Scanning Center At TDP Central Office | Oneindia Telugu

నగరాలతో పోల్చుకుంటే.. పట్టణాలు, గ్రామస్థాయిలో ఉండే బ్యాంకుల్లో రద్దీ అధికంగా ఉంటుంది. అందుకే బ్యాంకు ఉద్యోగులు ముందుచూపుతో వ్యవహరిస్తున్నాురు. ఖాతాదారులు కౌంటర్ల సమీపానికి వచ్చి, తమ ముఖంలో ముఖం పెట్టి మాట్లాడే వీలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కౌంటర్‌ వద్ద మూడు వరసలుగా తాడు కట్టారు. ఖాతాదారులు, తమకు మధ్య కనీసం ఒక మీటర్ దూరం ఉండేలా తాళ్లను కట్టారు. మీటర్ దూరం నుంచే తమ లావాదేవీలను నిర్వహిస్తున్నారు. తాడును దాటుకుని ఎవరూ రావొద్దని సూచిస్తున్నారు.

English summary
Bank employees in Andhra Pradesh taking precautionary measures due to Coronavirus outbreak in across the India. Bank employees tied a rope at counter as three rows distance atleast 1.5 meters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X