వచ్చే వారం వరుసగా మూడు రోజులు బ్యాంకుల బంద్..!!
బ్యాంకు ఖాతాదారులకు బిగ్ అలర్ట్. నిత్యం బ్యాంకుల్లో లావా దేవీలు నిర్వహించే కస్టమర్లకు ఆర్బీఐ కీలక సమాచారం అందించింది. వచ్చే వారంలో బ్యాంకులు వరుసగా మూడు రోజుల పాటు మూతపడనున్నాయి. దీంతో... బ్యాంకు యాజమాన్యాలు కస్టమర్లకు ముందస్తు సమాచారం అందిస్తున్నారు. ఆన్ లైన్ బ్యాకింగ్ సదుపాయం సద్వినియోగం చేసుకోవాలని... ముందుగానే లావా దేవీలను పూర్తి చేసుకోవలని సూచిస్తున్నారు.
బ్యాంకులు వరుసగా మూడు రోజులు మూతబడనున్నాయి. జూన్ 22 నుండి జూన్ 25 వరకు యథావిథిగా నడవనున్నాయి. అయితే జూన్ 26 నుండి జూన్ 28 వరకు వరుసగా మూడు రోజుల పాటు బంద్ కానున్నాయి. భారతదేశంలోని అన్ని బ్యాంకులు జూన్ 22, జూన్ 23, జూన్ 24న జూన్ 25 తేదీలలో యధావిధిగా పనిచేస్తాయి. జూన్ 26న మొహర్రం చివరి రోజు కారణంగా చాలా నగరాల్లో బ్యాంకులు మూతపడనున్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో, ఖాతాదారులు ముందస్తుగానే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. జూన్ 27న నాలుగవ శనివారం రావడంతో బ్యాంకులు మూతపడనున్నాయి. ఇక 28వ తేదీన ఆదివారం కావడంతో బ్యాంకులు బంద్ అవుతాయి.

ఖాతాదారులకు కీలక సూచనలు
దీంతో, మొత్తం వచ్చే వారంలో వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులు మూతపడనుండటం తో ఖాతాదారులకు ఏమైనా ప్రత్యక్షంగా బ్యాంకుల్లో చేయాల్సిన లావా దేవీలను ముందస్తుగానే ప్లాన్ చేసుకోవటం మంచిందని సూచిస్తున్నారు. సెలవు రోజుల్లో ఖాతాల నిర్వహణ సమస్యగా ఉండే అవకాశం ఉండటంతో... బ్యాంకింగ్ కు ఉన్న ఇతర మార్గాల ద్వారా పూర్తి చేసుకోవాలని ఖాతాదారులకు సూచనలు చేస్తున్నారు. అయితే.. ప్రాంతాలకు అనుగుణంగా కొన్ని సందర్భాల్లో బ్యాంకుల సెలవులు మారుతూ ఉంటాయి. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా బ్యాంకులకు కొన్ని సందర్భాల్లో సెలవులు ఖరారు చేస్తారు. దీంతో.. ఖాతాదారులు బ్యాంక్‌కు వెళ్లేముందు ఒకసారి చెక్ చేసుకుని వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.













Click it and Unblock the Notifications