విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పెద్ద నగదు నోట్ల రద్దు.. దుర్గ గుడికి భారీగా ఆదాయం

పెద్ద నగదు నోట్ల రద్దు ప్రభావంతో విజయవాడ కనకదుర్గ ఆలయం రెట్టింపు ఆదాయాన్ని పొందింది. ప్రతి నెల కోటి లేదా కోటి లోపు ఆదాయం వచ్చేది. కాని ఈ ఏడాది నవంబర్ మాసం పూర్తి కాకముందే సుమారు 2.89 కోట్ల ఆధాయం లభ

By Narsimha
|
Google Oneindia TeluguNews

విజయవాడ :పెద్ద నగదు నోట్ల రద్దు వ్యవహారం సామాన్యులను కష్టాల పాలు చేస్తోంటే....దేవాలయాలకు మాత్రం కుప్పలు కుప్పలుగా తెచ్చిపెడుతోంది. రద్దుచేసిన నగదు ను మార్పిడి చసుకోలేని పరిస్థితిలో ఉన్నవారు దేవాలయం హుండీలో ఈ డబ్బులను జమ చేస్తున్నారు. దీంతో దుర్గగుడికి భారీగా ఆధాయం వస్తోంది.

నల్లదనాన్ని మార్చుకొనే వీలులేకనో....ఇతరత్రా కారణాలు ఏమిటో తెలియదు కాని విజయవాడలోని కనకదుర్గ అమ్వారి హుండీ ఆదాయం ఒక్కసారిగా పెరిగిపోయింది. పెద్ద నగదు నోట్ల ప్రభావం దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చును.నెల రోజుల్లో ఈ దేవాలయం ఆదాయం కోటి లేదా కోటిరూపాయాలలోపుగా ఉంటుంది. కాని, ఈ దఫా రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది.

banned currency impact on temples:huge income for kanakadurga temple

రెట్టింపు ఆదాయం

పెద్ద నగదు నోట్ల ప్రభావం కారణంగా దుర్గగుడికి రెట్టింపు ఆదాయం వచ్చింది.ప్రతి నెల కోటి లేదా అంతకు లోపుగా ఆదాయం వచ్చేది.అయితే ఈ నెలలో రెండు కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. పెద్ద నగదు నోట్ల రద్దు కారణంగా నల్లధనాన్ని అమ్మవారి హుండీలో సమర్పించారని అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం హుండీ లెక్కింపు గురువారం సాయంత్రానికి పూర్తైంది. నెలరోజులకు రెండు కోట్ల 89 లక్షల31 వేల754 రూపాయాల ఆదాయం వచ్చింది. దీనికి తోడు 830 గ్రాముల బంగారం, 10 కేజీల 820 గ్రాముల వెండి వచ్చింది. రద్దు చేసిన నగదు కూడ పెద్ద మొత్తంలో హుండీలో దొరికింది.రద్దుచేసిన ఐదు వందల నోట్లు 15,723 ఉండగా, వెయ్యి నోట్లు 2941 ఉన్నాయి.పెద్ద నగదు నోట్ల రద్దు కారణంగా దుర్గగుడికి రెట్టింపు ఆదాయం వచ్చింది.

English summary
vijayawada kankadurga temple receive record income november month of 2016. an every month average 1 crore ruppes income for this temple. central governament decission banned currency impact on temple income.this month temple get 2.89 crores . 830 grams gold, 10 kgs silver also in hundi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X