నీచ రాజకీయాలు.. జగన్ ట్రాప్‌లో చంద్రబాబు, వాటికేం చెబుతావ్: సోము వీర్రాజు
అమరావతి: ఏపీలో మిత్రపక్షాలైన టీడీపీ - బీజేపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. హోదాపై ఇప్పటికే నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటోంది. ఇప్పుడు మోడీపై టీడీపీ నేతల ఫ్లెక్సీలు, విమర్శలతో ర్యాలీలు మరింత వేడి రాజేశాయి.
Recommended Video

ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా టీడీపీ చేస్తున్న నిరసనలు, వ్యాఖ్యలు శృతిమించుతున్నాయని బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. విష్ణు కుమార్ రాజు తర్వాత ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, మాధవ్‌లు టీడీపీ నేతలపై విమర్శలు గుప్పించారు.

బీజేపీని దెబ్బతీసే వ్యూహం
బీజేపీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్సీ సోము వీర్రాజు మండిపడ్డారు. మోడీపై టీడీపీ నేతలు ఇలా మాట్లాడుతుంటే చంద్రబాబు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఆవిరవుతున్న ఉక్కు సంకల్పం అంటూ మోడీపై తీసిన పాంప్లెట్‌పై ఏం మాట్లాడుతారని ప్రశ్నించారు.

ఎన్టీఆర్ సమయంలో ప్రారంభించారు.. బాబునేమనాలి
ఎంగిలి కాఫీలు తాగే అలవాటు బీజేపీకి లేదని సోము వీర్రాజు మండిపడ్డారు. ఎన్టీఆర్ ప్రారంభించిన గాలేరు - నగరిని పూర్తి చేయనందుకు ఎవరి మెడలు వంచాలని ప్రశ్నించారు. అందుకు చంద్రబాబును ఏమనాలని నిలదీశారు. ఏపీలో బీజేపీని వ్యూహాత్మకంగా దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందన్నారు.

వైసీపీ ట్రాప్‌లో టీడీపీ
వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీల ట్రాప్‌లో టీడీపీ పడిందని సోము వీర్రాజు ధ్వజమెత్తారు. తెలుగు గంగను కూడా ఇప్పటి దాకా పూర్తి చేయలేదని గుర్తు చేశారు. అరకు కాఫీని గతంలో విద్యాసాగర రావు డెవలప్ చేశారని చెప్పారు. ఎంగిలి కాఫీలు తమకు అలవాటు లేదన్నారు.

ఫ్లెక్సీలతో నీచ రాజకీయాలు
ఫ్లెక్సీలతో టీడీపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. అసెంబ్లీ ప్రారంభం నుంచి మోడీని, బీజేపీని అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారిక వెబ్ సైట్లో దారుణమైన పోస్టులు పెడుతున్నారని చెప్పారు. టీడీపీ అఫీషియల్ ఫేస్‌బుక్‌లో ప్రధానిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. పార్లమెంటులో టీడీపీ ఎంపీలు జోకర్ వేషాలు వేస్తున్నారని దుయ్యబట్టారు.












Click it and Unblock the Notifications