నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నెల్లూరు జిల్లాలో రెడ్లకు చెక్ పెట్టేందుకు ఆ మంత్రి పావులు కదుపుతున్నారా ?

|
Google Oneindia TeluguNews

నెల్లూరు జిల్లా స్ధానిక సంస్ధల ఎన్నికల కోసం ప్రకటించిన బీసీ రిజర్వేషన్లలో ఈసారి భారీగా కోతపడింది. మొత్తం రిజర్వేషన్లలో 10 శాతమే తగ్గినా సీట్లలో మాత్రం భారీగా కోత పడింది.. జిల్లాలో గత స్ధానిక పోరుతో పోలిస్తే బీసీ రిజర్వేషన్లు తలకిందులయ్యాయని నేతలు భావిస్తున్నారు. అయితే తాజా పరిణామాలకు జిల్లాలో రెడ్లకూ, బీసీలకు మధ్య నెలకొన్న ఆధిపత్య పోరే కారణమని తెలుస్తోంది.

నెల్లూరులో రెడ్ల రాజకీయం

నెల్లూరులో రెడ్ల రాజకీయం

నెల్లూరు జిల్లాలో సహజంగానే దశాబ్దాలుగా రెడ్ల ఆధిపత్యం ఎక్కువ. నెల్లూరు రెడ్లంటే ఏపీ వ్యాప్తంగా అదో ప్రత్యేకమైన భావన. అయితే నెల్లూరు రెడ్లలోనూ ఎన్నో రకాలు ఉన్నారు. అయితే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో అప్పటివరకూ ఉప్పూ,నిప్పుగా ఉన్న రెడ్లంతా ఒకే తాటిపైకి వచ్చారు. జిల్లాలో దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత ఒకేతాటిపైకి వచ్చిన రెడ్ల ప్రభావంతో వైసీపీ ఈ జిల్లాను క్లీన్ స్వీప్ చేసేసింది. జిల్లాలో పదికి పది సీట్లు గెల్చుకున్న వైసీపీకి అక్కడ ఇప్పుడు తిరుగులేదు. దీంతో ప్రత్యర్ధుల అవసరం లేకుండానే వారిలోనే వారికి ఆధిపత్య పోరు నెలకొంది.

 నెల్లూరులో బీసీల రాజకీయం

నెల్లూరులో బీసీల రాజకీయం

నెల్లూరులో రెడ్ల ప్రభావం అధికంగా ఉన్న జనాభా పరంగా బీసీలతో పాటు మిగతా కులాల సంఖ్య ఎక్కువ. దీంతో సహజంగానే జిల్లాపై తమ ప్రభావం ఉండాలని రెడ్లు, లేదు జనాభా పరంగా ఎక్కువగా ఉన్నందున పెత్తనం తమ చేతుల్లోనే ఉండాలని బీసీలు కోరుకుంటున్నారు. అందునా బీసీ సామాజికవర్గానికి చెందిన అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు సిటీ నుంచి ఎమ్మెల్యే కావడం, ఆ తర్వాత బీసీ కోటాలో మంత్రి కూడా కావడంతో ఇక ఆయనకు రెడ్లతో సై అంటే సై అనే పరిస్ధితి. అయితే సీఎం జగన్ కు భయపడి రెడ్లతో నేరుగా తలపడకున్నా అంతర్గతంగా ఈ పోరు నడుస్తూనే ఉంది.

 స్ధానిక పోరులో బయటపడ్డ విభేదాలు

స్ధానిక పోరులో బయటపడ్డ విభేదాలు

వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జిల్లాలో పెత్తనం చెలాయిస్తున్న రెడ్లకు స్ధానిక పోరులో చెక్ పెట్టాలని ఇతర సామాజికవర్గాలు, ముఖ్యంగా బీసీలు భావిస్తున్నారు. అదే సమయంలో జిల్లాలో తమ ఆధిపత్యం కొనసాగించడం కోసం రెడ్లు కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే తాజాగా ప్రకటించిన స్ధానిక సంస్ధల రిజర్వేషన్లలో బీసీల రిజర్వేషన్లు పదిశాతం మేర తగ్గడం, అంతకంటే ఎక్కువగానే జిల్లాలో బీసీ సీట్లకు కోత పడటం జరిగిపోయాయి. ఇదే ఇప్పుడు కాక రేపుతోంది. బీసీ రిజర్వేషన్ల కోత వెనుక ఎవరున్నారనేది పక్కనబెడితే కీలక సమయంలో బీసీ సీట్లలో కోత పడటాన్ని ఆయా సామాజికవర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి.

Recommended Video

YSRCP Rajya Sabha Candidates| AP CM Jagan Gift To Mukesh Ambani | Oneindia Telugu
 బీసీలకు అండగా మంత్రి అనిల్

బీసీలకు అండగా మంత్రి అనిల్

నెల్లూరు జిల్లాలో బీసీ సీట్లలో భారీగా కోత పడటంపై ఆగ్రహంగా ఉన్న బీసీలు ఈసారి రెడ్లకు చెక్ పెట్టేందుకు అంతర్గతంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే వీరి వెనుక మంత్రి అనిల్ ఉన్నారా లేదా అనేదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. రెడ్లకు వ్యతిరేకంగా రాజకీయాలు నడిపితే సీఎం జగన్ దృష్టిలో ప్రతికూల సంకేతాలు వెళతాయని భావిస్తున్న అనిల్.. నేరుగా ఎవరినీ విమర్శించడం లేదు. అయితే రెడ్లకు వ్యతిరేకంగా ఉన్న బీసీల కు మాత్రం అనిల్ మద్దతు ఉందనే ప్రచారం సాగుతోంది. అయితే స్ధానిక పోరులో ఫలితాలు తారుమారైతే పదవులు కోల్పోవాల్సిన పరిస్ధితుల్లో నేతలు సామాజికవర్గాన్ని చూసుకుంటారా లేక పార్టీ ప్రతిష్టకు కట్టుబడతారా అన్నది తేలాల్సి ఉంది.

English summary
BC versus Reddy war could be behind cutoff in BC seats in Nellore disrict in Local body elections. After Ycp govt comes into power reddys are looking more active than earlier in the district. it could be creating troubles for BCs in the district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X