అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బోస్టన్ నివేదిక అదే తేల్చింది: రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ: అమరావతి ప్రాంత అభివృద్ధి పైనా..!

|
Google Oneindia TeluguNews

జీఎన్ రావు కమిటీ సిఫార్సులకు కొనసాగింపుగానే బోస్టన్ నివేదిక ఉన్నట్లుగా స్పష్టం అవుతోంది. ప్రభుత్వం రాష్ట్రంలో సమతుల్యాభివృద్ధి.. సమగ్రాభివృద్ధి దిశగా సూచనల కోసం నియమించిన బోస్టన్ కన్సెల్టెం ట్ గ్రూపు తమ నివేదికను ముఖ్యమంత్రి జగన్ కు అందచేసింది. అందులో బహుళ రాజధానుల అంశాన్ని ప్రస్తావించింది. ఏపీలో అధికార వికేంద్రీకరణ దిశగా కీలక సిఫార్సులు చేసింది. అమరావతి ప్రాంత అభివృద్ధి వ్యూహాలను బీసీజీ తన నివేదికలో స్పష్టం చేసింది. అభివృద్ధి సూచికల వారీగా జిల్లాల పరిస్థితులను వివరించిన బీసీజీ..తీసుకోవాల్సిన చర్యల పైన స్పష్టమైన సూచనలను ప్రభుత్వం ముందు తమ నివేదికలో పొందు పర్చింది.

రాజధాని తరలింపు కార్యాచరణ ఫిక్స్ : రేపు బీసీజీ నివేదిక: అసెంబ్లీలో నిర్ణయం..కానీ కోర్టులో..!రాజధాని తరలింపు కార్యాచరణ ఫిక్స్ : రేపు బీసీజీ నివేదిక: అసెంబ్లీలో నిర్ణయం..కానీ కోర్టులో..!

బహుళ రాజధానులు..అధికార వికేంద్రీకరణ

బహుళ రాజధానులు..అధికార వికేంద్రీకరణ

ఊహించిందే జరిగింది. ఇప్పటికే ప్రభుత్వం ఆలోచన చేస్తున్న దానికి అనుగుణంగానే మొన్న జీఎన్ రావు కమిటీ..ఇప్పుడు బోస్టన్ కమిటీ నివేదికలు ప్రభుత్వానికి చేరాయి. బోస్టన్ కమిటీ తమ నివేదికను సీఎం జగన్ కు అందించింది. అందులో బహుళ రాజధానులు..అధికార వికేంద్రీకరణ దిశగా బోస్టన్ సిఫార్సులు చేసింది. రాష్ట్రంలో సమతుల్యాభివృద్ధి.. సమగ్రాభివృద్ధి అవసరమని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న రాజధాని అమరావతి ప్రాంత అభివృద్ధి వ్యూహాలను తన నివేదికలో ప్రస్తావించిన బీసీజీ..తక్షణం చేపట్టాల్సిన చర్యలను సైతం సూచింది. ఇక, ఏపీలో అభివృద్ధి సూచికల వారీగా జిల్లాల పరిస్థితులను వివరించింది. ప్రాంతాల వారీగా ఎంచుకోవాల్సిన అభివృద్ధి వ్యూహాలను వివరించిన బీసీజీ..కొన్ని కీలక సూచనలను నివేదికలో పొందు పర్చింది. అదే విధంగా..వ్యవసాయ, పారిశ్రామిక, టూరిజం, మత్స్య రంగాల్లో ప్రణాళికలను వివరించి ఎక్కడ ఏ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలో వివరించింది.

గ్రీన్ ఫీల్డ్ సిటీల కంటే...బ్రౌన్ ఫీల్డ్ సిటీలే మెరుగ్గా..

గ్రీన్ ఫీల్డ్ సిటీల కంటే...బ్రౌన్ ఫీల్డ్ సిటీలే మెరుగ్గా..

బీసీజీ తమ నివేదికలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న గ్రీన్‌ఫీల్డ్‌ మెగా సిటీలు.. వాటి ఆర్థిక పనితీరును నివేదికలో ప్రస్తావించించింది. అనుకున్న లక్ష్యాలను సాధించాయా.. లేదా.. అన్నదానిపై గణాంకాలతో వివరించిన బీసీజీ..ఏపీలో ఉన్న పరిస్థితుల్లో బ్రౌన్ ఫీల్డ్ రాజధాని ఉత్తమమని తేల్చింది. ప్రపంచంలోని వివిధ దేశాల బహుళ రాజధానులు.. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బహుళ రాజధానులు, బహుళ రాజధాని కార్యకలాపాల కేంద్రాలపై ప్రస్తావన తీసుకురావటం ద్వారా ఏపీలో మూడు రాజధానుల ప్రతిపాదనకు బోస్టన్ నివేదిక సైతం మద్దతుగా నిలుస్తోంది. ఇక, రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ అంశాన్ని తన నివేదికలో ప్రస్తావించిన బీసీజీ..దాదాపు జీఎన్ రావు కమిటీ తరహాలోనే సూచనలు చేసింది. ఇక, కోణంలో తీసుకోవాల్సిన చర్యలను వివరించిన బీసీజీ..రాష్ట్రం సత్వర ఆర్థికాభివృద్ధి, సత్వర ఫలితాల సాధనకు ఏయే రంగాల్లో పెట్టుబడులు పెట్టాలన్న అంశాన్ని సైతం వివరంగా ప్రభుత్వానికి నివేదిక ద్వారా అందచేసింది.

6న తొలి చర్చ.. అసెంబ్లీలో ఆమోదం..

6న తొలి చర్చ.. అసెంబ్లీలో ఆమోదం..

ఇక, ప్రభుత్వం నియమించిన రెండు కమిటీలు జీఎన్ రావు..బోస్టన్ నివేదికలు రెండూ ప్రభుత్వానికి అందాయి. దీంతో..ప్రభుత్వం ఈ రెండు కమటీల నివేదికల అధ్యయనం కోసం హైపవర్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తొలి సమావేశం ఈ నెల 6వ తేదీన సచివాలయంలో జరగనుంది. ఆ తరువాత మొత్తంగా 20 రోజుల్లో హైపవర్ కమిటీ ఈ రెండు కమిటీల సిఫార్సులను క్రోడీకరించిన ప్రభుత్వానికి పూర్తి స్థాయి నివేదిక అందించనుంది. ఈ నెల 8న జరిగే కేబినెట్ సమావేశంలో బోస్టన్ కమిటీ నివేదిక పైన చర్చించనున్నారు. ఇక, హైపవర్ కమిటీ నివేదిక అందిన తరువాత ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి అక్కడ చర్చించి..మూడు రాజధానుల అంశం పైన ప్రభుత్వం అదికారికంగా నిర్ణయం ప్రకటించనుంది.

English summary
Bostan consultancy Group sumbitted report ot cm Jagan on AP inclusive development and decentralisation. BCG also reccomanded for multiple capitals in AP for speed growth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X