భయపడి కూర్చుంటే...: తమ్ముళ్లకు బాబు హితబోధ
హైదరాబాద్: పరిస్థితులకు భయపడి ఇంట్లో కూర్చుంటే రాజకీయాలు చేయలేమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గురువారం తెలుగు తమ్ముళ్లకు హితబోధ చేశారు. సీమాంధ్రలోని పలు జిల్లాల్లో తెలుగు జాతి ఆత్మగౌరవ యాత్ర పూర్తి చేసుకున్న చంద్రబాబు ఈ రోజు ఉదయం హైదరాబాదుకు చేరుకున్నారు.
ఆయన ఉదయం తన నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన తదనంతర పరిణామాలపై వారు చర్రించారు. తన ఆత్మగౌరవ యాత్ర జరిగిన తీరును, ప్రజా స్పందనను ఆయన ఈ సమావేశంలో నేతలకు తెలియజేశారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ... టిడిపిని దెబ్బతీయాలనే కాంగ్రెసు స్వార్థ రాజకీయాలకు పాల్పడుతోందని బాబుకు చెప్పారు. కాంగ్రెసు ఇరు ప్రాంతాల ప్రజలను రెచ్చగొడుతోందని అభిప్రాయపడ్డారు.
దీనికి చంద్రబాబు స్పందించారు. రెండు ప్రాంతాల్లో టిడిపిని కాపాడుకోవాల్సిన అవసరముందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల తరహాలో ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాలేమన్నారు. రెండు ప్రాంతాల ప్రజల్లో భావోద్వేగాలు ఉన్నాయని చెప్పారు. భయపడి ఇంట్లో కూర్చుంటే రాజకీయాలు చేయలేమన్నారు. ప్రజలు టిడిపి పట్ల సానుకూలతతో ఉన్నారన్నారు. కాగా, బాబు యాత్రకు సీమాంధ్రలో ప్రజల నుండి అనూహ్య స్పందన వస్తోంది.













Click it and Unblock the Notifications