Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లేదంటూనే చురక, అఖిల నుంచి భూమా నాగిరెడ్డి దాకా: పవన్ ఆసక్తికర విషయాలు

ఒంగోలు: అధికారులు ప్రజల పట్ల ధిక్కార వైఖరిని కాకుండా సున్నితంగా ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన శనివారం ఒంగోలులో పర్యటించిన విషయం తెలిసిందే. ఆయన కృష్ణా నది పడవ ప్రమాద బాధితులను పరామర్శించారు.

ఒక వైపు అభిమానులు, కార్యకర్తలకు భరోసా, నిర్దేశం, మరోవైపు పడవ ప్రమాద మృతుల కుటుంబీకులకు ఓదార్పు, మధ్య మధ్యలో పార్టీ విధానాలపై తనదైన రీతిలో ప్రతిస్పందనలు.. ఇలా పవన్ ఒంగోలు పర్యటన కొనసాగింది. ఒంగోలులో ఉన్నంత సేపు తీరిక లేకుండా గడిపారు.

చలించిపోయిన పవన్ కళ్యాణ్, నా దురదృష్టం

చలించిపోయిన పవన్ కళ్యాణ్, నా దురదృష్టం

మొదట ఎన్టీఆర్‌ కళాక్షేత్రంలో పడవ ప్రమాద మృతుల కుటుంబాలతో మాట్లాడిన ఆయన చలించిపోయారు. తల్లిదండ్రుల్ని, బిడ్డలను కోల్పోయిన మిమ్మల్ని ఇలా కలవాల్సి రావడం నా దురదృష్టకరం అని పడవ ప్రమాద మృతుల కుటుంబీకులనుద్దేశించి అన్నారు.

బాధ్యతగా భావించి వచ్చా

బాధ్యతగా భావించి వచ్చా

ఇవి నష్టపరిహారంతో తీరే బాధలు కావని, ఇలాంటివి అర్థం చేసుకోవాలంటే సున్నితమైన మనస్సు ఉండాలని పవన్ అన్నారు. పోయిన ప్రాణాలను ఎలాగూ తెచ్చి ఇవ్వలేమని, కనీసం వారిని కలిసి ధైర్యం చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని భావించి వచ్చానని చెప్పారు.

 నష్టపరిహారం కంటే, ముందే చర్యలు

నష్టపరిహారం కంటే, ముందే చర్యలు

ఆయుష్షును అర్ధంతరంగా ముగించేస్తున్న ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. చనిపోయిన తర్వాత నష్టపరిహారం చెల్లించే కంటే ముందే సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న ప్రభుత్వానిదే అన్నారు.

 తాత్కాలిక ప్రయోజనాలు అంటే ఇలాంటివే జరుగుతాయి

తాత్కాలిక ప్రయోజనాలు అంటే ఇలాంటివే జరుగుతాయి

ప్రభుత్వంలో ఉండే పెద్దలు తాత్కాలిక ప్రయోజనాల కోసం చూస్తే ఇలాంటి ఘటనలే జరుగుతాయని పవన్ కళ్యాణ్ అన్నారు. పర్యాటకశాఖ మంత్రి అఖిలప్రియ ఒంగోలుకు వచ్చి బాధిత కుటుంబాలను పరామర్శించి ఉండాల్సిందని జనసేనాని అభిప్రాయపడ్డారు.

 లండన్‌లో ప్రశ్న, ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు

లండన్‌లో ప్రశ్న, ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు

ఇటీవల తాను లండన్‌ వెళ్లినప్పుడు వింత అనుభవం ఎదురయిందని పవన్‌ చెప్పారు. గత సాధారణ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీలకు అనుకూలంగా వ్యవహరించిన తనకు మానవ తప్పిదం వల్ల జరిగిన పడవ ప్రమాదంపై ప్రభుత్వాలను నిలదీయాల్సిన బాధ్యత లేదా అని లండన్‌లో ఓ ఆంధ్రా యువకుడు ప్రశ్నించాడని, ఆ సమయంలో తనకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదన్నారు.

 ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ చురకలు

ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ చురకలు

ఎన్టీఆర్ క్షేత్రంలో బాధిత కుటుంబ సభ్యులను కొందరిని వేదిక పైకి పిలిపించి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. తాను ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలపై మాటలతో దాడులు చేసేందుకు ఇక్కడకు రాలేదని, ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అందరు సున్నితత్వం మరిచిపోతున్నంత కాలం ఇలాంటి కన్నీళ్లే మిగులుతాయని ప్రభుత్వానికి, అధికారులకు చురకలు అంటించారు.

కన్నీరుమున్నీరైన ఓ యువతి

కన్నీరుమున్నీరైన ఓ యువతి

తన తల్లి చిన్నప్పటి నుంచి కష్టాల్లోనే పుట్టి పెరిగిందని, వివాహం అయిన మూడు సంవత్సరాలకే తన తండ్రి మరణించాడని, తనకు నాలుగు నెలల వయస్సు నుంచి సర్వస్వం తానై పెంచి పోషించిందని మనస్విని అనే యువతి చెప్పింది. తనకు ఎంతో చేసిన తన తల్లిని, తనకు ఉద్యోగం వచ్చాక కూర్చోబెట్టి పోషించాలని అనుకున్నానని, కానీ ఇ ప్రమాదం తన ఆశలను అడియాసలు చేశాయన్నారు.

 లైఫ్ జాకెట్లు అడిగినా ఇవ్వలేదు

లైఫ్ జాకెట్లు అడిగినా ఇవ్వలేదు

తాము లైఫ్ జాకెట్లు అడిగినా ఇవ్వలేదని తల్లిని కోల్పోయిన మనస్విని చెప్పారు. ఇప్పుడు నేను అనాథగా మారిపోయానని, కనీసం బోటుకు అనుమతి లేదని, బోటు డ్రైవర్‌కు లైసెన్స్ లేదని, బోటు తిరగబడినప్పుడు నీళ్లలో కన్నుమూసిన వారు ఎంతగా విలవిలలాడి ఉంటారోనని ఊహించుకోవడానికే భయమేస్తోందన్నారు. తన తల్లికి నీళ్లంటనే భయమని, ఆమె ఎంతగా విలవిలలాడిందో అన్నారు.

 కేసీఆర్‌ను అడగొచ్చుగా

కేసీఆర్‌ను అడగొచ్చుగా

తెలంగాణ ప్రభుత్వం బాసరలో ఆంధ్ర విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంట్స్ ఇవ్వడం లేదని, మరి ఏపీ మంత్రులు, తెరాస మంత్రుల పెళ్లిళ్లకు వెళ్తారని, వ్యాపారాలు చేస్తారని, ఎవరో మంత్రి అల్లుడికి కాంట్రాక్టులు ఉన్నాయని, ఇవన్నీ నేను చెబుతున్న మాటలు కాదని రేవంత్ రెడ్డి చెప్పారని, ఇంత మంచి సంబంధాలు ఉన్నప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను, మంత్రులను బాసర విద్యార్థుల ఫీజు రీయింబర్సుమెంట్ అడగడలేరా అని పవన్ ప్రశ్నించారు.

భూమా అఖిలప్రియకు

భూమా అఖిలప్రియకు

తల్లిదండ్రులు లేని బాధ ఎలా ఉంటుందో భూమా అఖిలప్రియకు తెలుసునని, ఆమె మాత్రం చొరవ చూపకపోవడం ఆశ్చర్యంగా ఉందని, మంత్రి అనగానే రెడ్ లైట్, ఎస్కార్టుతో తిరిగితే సరిపోదని, ఆఫ్తులను కోల్పోయిన బాధ అందరికంటే ఎక్కువ తెలిసిన అఖిల ఒంగోలుకు రావాలని పవన్ కళ్యాణ్ సూచించారు.

భూమాకు అందుకే వ్యతిరేక ప్రచారం చేయలేదు

భూమాకు అందుకే వ్యతిరేక ప్రచారం చేయలేదు

మృతుల కుటుంబాలతో మాట్లాడాలని పవన్.. అఖిలప్రియకు సూచించారు. భూమా కుటుంబం ప్రజారాజ్యంలో ఉన్నప్పటి నుంచి తనకు తెలుసునని, అందువల్లే భూమా నాగిరెడ్డి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు తాను ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేయలేదని చెప్పారు.

భూమా నాగిరెడ్డి ఫోన్ చేసి చెప్పారు

భూమా నాగిరెడ్డి ఫోన్ చేసి చెప్పారు

ఆ సమయంలో తాను నంద్యాలకు వెళ్లాల్సింది అని, కానీ పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తే ఓడిపోతానని, రాకుండా చూడాలని తన వాళ్లకు భూమా నాగిరెడ్డి ఫోన్ చేసి కోరారని పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శోభా నాగిరెడ్డి మృతితో దుఖంతో ఉన్న కుటుంబాన్ని ఇంకా దుఖంలోకి నెట్టలేక తాను నంద్యాలలో టీడీపీ తరఫున ప్రచారం చేయలేదన్నారు. ఇటీవల నంద్యాల ఉప ఎన్నికల్లో జనసేన రంగంలో పెట్టాల్సి ఉందని, తల్లిదండ్రులను కోల్పోయి బాధలో ఉన్న పిల్లల్ని ఇంకా బాధ పెట్టవద్దనే పోటీ చేయలేదన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+