బియాస్ ట్రాజెడీ: వారి కన్నీరు గడ్డ కట్టి... (పిక్చర్స్)

హైదరాబాద్‌: బియాస్ నదిలో లభ్యమైన మూడు మృతదేహాలు హైదరాబాద్ చేరుకున్నాయి. నాలుగు మృతదేహాలు తాజాగా లభ్యమయ్యాయి. మూడు మృతదేహాలు రాష్ట్రానికి చేరుకున్నాయి. తల్లిదండ్రుల శోకం చెప్పనలవి కాదు, రోజులు గడుస్తున్న కొద్దీ వారిలో కన్నీరు గడ్డకట్టిన భ్రాంతి కలుగుతోంది.

హైదరాబాద్‌ నల్లకుంటకు చెందిన రుత్విక్‌తో పాటు వరంగల్‌ జిల్లా నర్సంపేట, గీర్మాజీపేటలకు చెందిన పరమేశ్వర్‌, మిట్టపల్లి అఖిల్‌తో పాటు ఖమ్మం జిల్లాకు చెందిన కిరణ్‌లుగా అధికారులు గుర్తించారు.

ఈ నెల 8న నగర శివారుల్లోని బాచుపల్లికి చెందిన విజ్ఞాన్‌ ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులు స్టడీ టూర్‌ కోసం ఉత్తరప్రదేశ్‌లోని బియాన్‌ నదికి చేరుకున్న సంగతి తెలిసిందే. అక్కడ ప్రమాదవశాత్తూ డార్జీ డ్యాం నుంచి అక్కడి అధికారులు నీటి ని వదలడంతో ఫోటోల కోసం నదిలోకి దిగిన విద్యార్థులు ఒక్కసారిగా పెరిగిన నీటి ఉధృ తికి 24 మంది విద్యార్థులు గల్లంతయ్యారు.

హైదరాబాద్‌కు మృతదేహాలు

హైదరాబాద్‌కు మృతదేహాలు

బియాస్ నదిలో గల్లంతై ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు విద్యార్థుల మృతదేహాలు హైదరాబాదుకు చేరుకున్నాయి.

కిరణ్ శవపేటిక

కిరణ్ శవపేటిక

ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి కిరణ్ శవపేటిక వద్ద బంధువులు ఇలా.. అతని శవపేటికను తీయడానికి ఇలా..

కిరణ్ తండ్రి వెంకటరమణ

కిరణ్ తండ్రి వెంకటరమణ

బియాస్ నది ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కొడుకు కిరణ్ కోసం ఏడ్చి ఏడ్చి తండ్రి వెంకటరమణ కళ్లలో నీరు గడ్డ కట్టకపోయే ఉంటుంది.

మిత్రుడి కడపటి చూపు కోసం..

మిత్రుడి కడపటి చూపు కోసం..

హైదరాబాద్‌కు చేరిన కిరణ్ మృతదేహం వద్ద మిత్రులు సంతాపం ప్రకటిస్తూ, దీర్ఘ శోక సముద్రంలో మునిగిపోయి ఇలా..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+