దారుణం: బండరాయితో మోది యాచకురాలి దారుణ హత్య (ఫోటోలు)
విశాఖపట్నం: అన్నెం పున్నె ఎరుగని ఓ యాచకురాలిని గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం తెల్లవారుజామున అత్యంత దారణంగా హత్య చేశారు. పాతనగరం షాదీఖానాను ఆనుకుని ఉన్న పేవ్‌మెంట్‌పై మూడేళ్లుగా ఆమె నివసిస్తోంది.
షాదీఖానాలో పనిచేసే వాచ్‌మెన్ ఆనంద్ కుమార్ భార్య కాజల్ శుక్రవారం ఉదయం 5 గంటలకు ప్రాంగణంలో పడి ఉన్న మృతదేహాన్ని చూసి భర్తకు తెలియజేసింది. ఆనంద్ కుమార్ వెంటనే షాదీఖానా ఛైర్మన్ అప్జల్ ఖాన్, మేనేజర్ బాబ్జీలకు సమాచారం అందించగా వారు ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సంఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు డాగ్ స్వాడ్‌ను పిలిపించారు. పోలీసు జాగిలం షాదీఖానా ఆవరణలో చక్కర్లు కొట్టి బైటకు వెళ్లి తిరిగి ఆవరణలోకే వచ్చింది. లా అండ్ ఆర్డర్ డీసీసీ త్రివిక్రమ వర్మ, దక్షిణ నియోజక వర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సంఘటనా స్ధలాన్ని సందర్శించారు.
యాచకురాలికి సుమారు 50 ఏళ్ల వయసు ఉంటుందని డీసీపీ తెలిపారు. తెల్లవారుజామున 3-4 గంటల మధ్యలో పేవ్‌మెంట్‌పై ఆమెను బండరాయితో తలమీద మోది హత్య చేసి ఉంటారని షాదీఖానా ఆవరణలోకి ఈడ్చుకువచ్చి పడేసి ఉంటారని ఆయన చెప్పారు.
ఇదే ఆవరణలో ఉ్న బీఓఐ ఏటీఎం సీసీ కెమెరా పుటేజీని పరిశీలించి హంతకుల జాడ తెలుసుకుంటామని, నిందితుడిని త్వరలోనే పట్టుుకుంటామని చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. సీఐ శ్రీనివాసరావు నేతృత్వంలో పోలీసులు కేసును పరిశోధిస్తున్నారు.
ఎవరైనా అన్నం తెచ్చిపెడితే ముందుగా జంతువులకు పెట్టికాని తాను తినేది కాదని, అటువంటి యాచకురాలిని హత్య చేసే అవసరం ఎవరికుందా అని ఈ ప్రాంత ప్రజలు విస్తుతపోతున్నారు.

దారుణం: బండరాయితో మోది యాచకురాలి దారుణ హత్య
అన్నెం పున్నె ఎరుగని ఓ యాచకురాలిని గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం తెల్లవారుజామున అత్యంత దారణంగా హత్య చేశారు. పాతనగరం షాదీఖానాను ఆనుకుని ఉన్న పేవ్‌మెంట్‌పై మూడేళ్లుగా ఆమె నివసిస్తోంది.

దారుణం: బండరాయితో మోది యాచకురాలి దారుణ హత్య
షాదీఖానాలో పనిచేసే వాచ్‌మెన్ ఆనంద్ కుమార్ భార్య కాజల్ శుక్రవారం ఉదయం 5 గంటలకు ప్రాంగణంలో పడి ఉన్న మృతదేహాన్ని చూసి భర్తకు తెలియజేసింది. ఆనంద్ కుమార్ వెంటనే షాదీఖానా ఛైర్మన్ అప్జల్ ఖాన్, మేనేజర్ బాబ్జీలకు సమాచారం అందించగా వారు ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దారుణం: బండరాయితో మోది యాచకురాలి దారుణ హత్య
సంఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు డాగ్ స్వాడ్‌ను పిలిపించారు. పోలీసు జాగిలం షాదీఖానా ఆవరణలో చక్కర్లు కొట్టి బైటకు వెళ్లి తిరిగి ఆవరణలోకే వచ్చింది. లా అండ్ ఆర్డర్ డీసీసీ త్రివిక్రమ వర్మ, దక్షిణ నియోజక వర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సంఘటనా స్ధలాన్ని సందర్శించారు.

దారుణం: బండరాయితో మోది యాచకురాలి దారుణ హత్య
యాచకురాలికి సుమారు 50 ఏళ్ల వయసు ఉంటుందని డీసీపీ తెలిపారు. తెల్లవారుజామున 3-4 గంటల మధ్యలో పేవ్‌మెంట్‌పై ఆమెను బండరాయితో తలమీద మోది హత్య చేసి ఉంటారని షాదీఖానా ఆవరణలోకి ఈడ్చుకువచ్చి పడేసి ఉంటారని ఆయన చెప్పారు

దారుణం: బండరాయితో మోది యాచకురాలి దారుణ హత్య
ఇదే ఆవరణలో ఉ్న బీఓఐ ఏటీఎం సీసీ కెమెరా పుటేజీని పరిశీలించి హంతకుల జాడ తెలుసుకుంటామని, నిందితుడిని త్వరలోనే పట్టుుకుంటామని చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. సీఐ శ్రీనివాసరావు నేతృత్వంలో పోలీసులు కేసును పరిశోధిస్తున్నారు.

దారుణం: బండరాయితో మోది యాచకురాలి దారుణ హత్య
ఎవరైనా అన్నం తెచ్చిపెడితే ముందుగా జంతువులకు పెట్టికాని తాను తినేది కాదని, అటువంటి యాచకురాలిని హత్య చేసే అవసరం ఎవరికుందా అని ఈ ప్రాంత ప్రజలు విస్తుతపోతున్నారు.

Click it and Unblock the Notifications