Railways: దేశంలోనే ఘోస్ట్ రైల్వే స్టేషన్.. ఇప్పటికీ సాయంత్రానికి ష్.. గప్ చుప్!
మనదేశంలో రైల్వేలో కొన్ని మిస్టరీ సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. కొన్ని రైల్వే స్టేషన్లను మూసివేసిన ఘటనలు కూడా ఉన్నాయి. అటువంటి రైల్వే స్టేషన్లలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బెగున్‌కొడార్ రైల్వే స్టేషన్ ఒకటి. ఆ రైల్వే స్టేషన్ లో దెయ్యాలు తిరుగుతాయని, అక్కడికి వెళ్ళిన వారు కొందరు దెయ్యాల కారణంగా ప్రాణాలు కోల్పోయారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
42 సంవత్సరాల పాటు మూసేసిన దెయ్యం రైల్వేస్టేషన్
ఇక దెయ్యాల కారణంగా 42 సంవత్సరాల పాటు ఈ రైల్వే స్టేషన్ ను మూసివేశారు. ప్రస్తుతం ఈ దెయ్యం రైల్వే స్టేషన్ తిరిగి కొనసాగుతున్నప్పటికీ దానికి ఉన్న పేరు మాత్రం అలాగే ఫిక్స్ అయిపోయింది. అసలు ఇంతకీ ఆ రైల్వేస్టేషన్లో ఏం జరిగింది? ఎందుకు 42 సంవత్సరాల పాటు ఆ రైల్వే స్టేషన్ ను మూసివేశారు? ప్రస్తుతం తెలుసుకుందాం.

ఆ స్టేషన్ లో దెయ్యం
బెగున్‌కొడార్ రైల్వేస్టేషన్. ఇది సౌత్ ఈస్ట్రన్ రైల్వే జోన్ పరిధిలో ఉన్న రైల్వేస్టేషన్. రాంచీ రైల్వే డివిజన్లో భాగం. ఇది పశ్చిమ బెంగాల్, పురూలియా జిల్లాలోని.. బెగున్‍కొడార్, ఝల్దాకి సేవలు అందిస్తోంది. ఈ రైల్వే స్టేషన్ ను 1960సంవత్సరంలో ప్రారంభించారు. అయితే ఇది ప్రారంభమైన ఏడు సంవత్సరాల తర్వాత ఇక్కడ పనిచేస్తున్న ఒక రైల్వే ఉద్యోగి రాత్రివేళ తాను దెయ్యాన్ని చూసానని, అక్కడ స్టేషన్లో పనిచేస్తున్న మరికొందరు ఉద్యోగులతో చెప్పాడు.
రైల్వే క్వార్టర్స్ లో మిస్టరీ డెత్స్
వారంతా దాన్ని పట్టించుకోలేదు. అయితే కొంతకాలం తర్వాత ఆ స్టేషన్ మాస్టర్, అతని కుటుంబ సభ్యులు రైల్వే క్వార్టర్స్ లో మరణించారు. వారి మరణానికి గల కారణాలు ఎవరికీ తెలియలేదు. దీంతో వారంతా చనిపోవడానికి దెయ్యమే కారణమని ప్రచారం జరిగింది. ఇక ఈ విషయం ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో అందరికీ తెలియడంతో ఆ రైల్వే స్టేషన్ కు రావాలంటే ప్రయాణికులు భయపడే పరిస్థితి వచ్చింది.
దెయ్యం తిరుగుతుందన్న ప్రచారంతో జరిగిందిదే
ఇక ఆ స్టేషన్ దగ్గరకు రాగానే రైళ్లకు కూడా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది అన్న ప్రచారం జనాలలో ఫోబియాగా మారింది. కొంతమంది ఆ రైల్వే స్టేషన్ దగ్గరకు రాగానే రైలు వెనుక దెయ్యం పరిగెత్తుతుంది అని, అని తాము చూసామని కూడా చెప్పటం మొదలుపెట్టారు. దీంతో లోకో పైలెట్లు ఆ స్టేషన్లో రైళ్లను ఆపడమే మానేశారు. స్థానికులు కూడా ఆ రైల్వే స్టేషన్ కి వచ్చి రైళ్ళు ఎక్కడం మానేశారు.
రైల్వేస్టేషన్ మూత పడిన తర్వాత కూడా జనాల్లో భయం
దెయ్యం భయంతో ప్రజలు రాకపోవటం, లోకో పైలెట్లు రైళ్ళు ఆపకపోవటం వంటి కారణాలతో రైల్వే స్టేషన్ ను రైల్వే మూసివేసింది. ఆ తర్వాత కాలంలో కూడా ఆ రైల్వే స్టేషన్ దగ్గరకు రాగానే రైళ్లను వేగంగా పోనిచ్చేవారు అంటే రైల్వే సిబ్బందిలో ఎంత భయం ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఇక ఆ రైల్వే స్టేషన్ దగ్గరకు రాగానే రైలు విండోలు క్లోజ్ చేసే వారంటే జనాలలో ఎంత భయం ఉండేదో అర్థం చేసుకోవచ్చు.
తిరిగి ప్రారంభం అయినా సరే నేటికీ సాయంత్రం అయితే నిర్మానుష్యం
ఇక ఆ రైల్వే స్టేషన్ మళ్లీ 2009 నుంచి పునః ప్రారంభించారు. మమతా బెనర్జీ సర్కార్ దీనిని అప్పుడు తిరిగి ప్రారంభించింది. ప్రస్తుతం బెగున్‌కొడార్ రైల్వే స్టేషన్ సేవలు అందిస్తున్నప్పటికీ, అక్కడ చీకటి పడిందంటే రైల్వేస్టేషన్లో ఒక్క మనిషి కనపడరు. సూర్యాస్తమయం తర్వాత ఆ స్టేషన్ కు ఎవరూ వెళ్ళరు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications