రాజమండ్రి కల్తీ పాల మరణాల వెనుక జరిగిందిదే.. షాకింగ్ రిపోర్ట్!
రాజమహేంద్రవరంలో ఇటీవల 12 మంది తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరగా, ఐదుగురు తీవ్రమైన కిడ్నీ సమస్యలతో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనకు కల్తీ పాలే కారణమని అధికారులు గుర్తించినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ పాలు వరలక్ష్మీ డెయిరీ నుంచి తెచ్చారని, నర్సాపురానికి చెందిన పాల వ్యాపారి గణేష్ అనధికారికంగా ఈ డెయిరీని నిర్వహిస్తున్నారని వెలుగులోకి వచ్చింది.
పాల కూలెంట్ గా ప్రొపైలీన్ గ్లైకాల్‌కి బదులుగా ఇథలీన్ గ్లైకాల్
డెయిరీలో శీతలీకరణ యంత్రంలో కూలెంట్ గా ఉపయోగించిన ఇథలీన్ గ్లైకాల్ లీక్ అయ్యి పాలల్లో కలవడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందని దర్యాప్తులో తేలింది. సాధారణంగా డెయిరీలు మరియు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలలో కూలెంట్ గా సురక్షితమైన ప్రొపైలీన్ గ్లైకాల్ ను ఉపయోగిస్తారు. అయితే ఖర్చు తగ్గించుకోవడం కోసం కొన్ని అనధికారిక డెయిరీలలో ప్రొపైలీన్ గ్లైకాల్‌కి బదులుగా ఇథలీన్ గ్లైకాల్‌ను వాడుతున్నారు.

ఇథలీన్ గ్లైకాల్ తో ప్రాణాలకే ప్రమాదం
ఇది చాలా డేంజర్. రాజమహేంద్రవరం లోని వరలక్ష్మీ డెయిరీ లో కూడా ఇదే రసాయనాన్ని ఉపయోగించినట్టు తెలుస్తోంది. ఇథిలీన్ గ్లైకాల్ చాలా ప్రమాదకరమైనటువంటి రసాయనం. 100 నుండి 200 మిల్లీ లీటర్లు మనిషి శరీరంలోకి చేరినా ప్రాణాంతకం అవుతుంది. సహజంగా దీని ప్రభావం మూడు దశలలో మనిషి శరీరం పైన చూపిస్తుంది. పాలు తాగిన తర్వాత అరగంట నుంచి 12 గంటల సేవించినట్లు మత్తుగా, తలనొప్పిగా వికారంగా అనిపిస్తుంది.
మూత్రపిండాలపై ఎఫెక్ట్
ఆ తర్వాత 12 గంటల నుంచి 24 గంటల వ్యవధిలో మెటబాలిక్ యాసిడోసిన్, తీవ్రమైన శ్వాస సమస్య, గుండెదడ రక్తపోటు వంటి సమస్యలు వస్తాయి. 24 గంటల నుండి 72 గంటలలోపు క్యాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్ ఏర్పడి మూత్రపిండాలు తీవ్రంగా దెబ్బతింటాయి. అవి పనిచేయడం మానేస్తాయి. తక్షణం చికిత్స అందించకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. ఇక అటువంటి ఇథలీన్ గ్లైకాల్ తియ్యగా ఉంటుంది.
పాలు చేదుగా ఉన్నాయని చెప్పటంతో అనుమానం
ఇది ఎవరు తీసుకోకుండా ఉండడం కోసం సాధారణంగా చేదు రుచిని ఇచ్చే రసాయనాన్ని కలుపుతారు. బాధితులలో కొందరు జనవరి 16వ తేదీన వచ్చిన పాలు చేదుగా ఉన్నాయని చెప్పడంతో డెయిరీలో కూలెంట్ లీక్ అయింది అన్న అభిప్రాయం అధికారులకు వచ్చింది. ఇక అదే ఈ కేసులో నిజమైంది.
కూలెంట్ లీక్ ప్రాణాలు తీసింది
జనవరి 15వ తేదీన ఒక క్యాన్ లోని పాలల్లో కూలెంట్ లీక్ అయినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత జనవరి 16వ తేదీన ఆ పాలను ఇళ్లకు సరఫరా చేశారు. జనవరి 17వ తేదీన యంత్రం నుండి కూలెంట్ లీక్ అవుతున్నట్టు గుర్తించి మరమ్మతులు చేశారు. ఏది ఏమైనా ఒక చిన్న నిర్లక్ష్యం అయిదుగురు ప్రాణాలు తీయడంతో పాటు, పలువురిని ఆసుపత్రి పాలు చేసింది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications