వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంతా తూచ్: 'రోజా రాకపోవడానికి ఇదీ కారణం, ఇది తప్ప మరేదీ కాదు'

విశాఖ మహాధర్నాకు రోజా రాకపోవడానికి ఆరోగ్య కారణాలేనని వైసిపి చెబుతోంది. ఆమెపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. హెల్త్ ఇష్యూ తప్ప అంతకు మించి ఆమె రాకపోవడానికి ఏ కారణాలు లేవని చెప్పారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజాకు ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ క్లాస్ పీకారని, దీంతో ఆమె మనస్తాపానికి గురయ్యారని, అందుకే విశాఖ మహాధర్నాకు హాజరు కాలేదని ప్రచారం జరిగింది. అయితే దీనిని వైసిపి కొట్టి పారేసింది.

చికాకులు... పద్ధతి మార్చుకో లేదంటే: రోజాకు జగన్ గట్టి వార్నింగ్?చికాకులు... పద్ధతి మార్చుకో లేదంటే: రోజాకు జగన్ గట్టి వార్నింగ్?

విశాఖ మహాధర్నాకు రోజా రాకపోవడానికి ఆరోగ్య కారణాలేనని వైసిపి చెబుతోంది. ఆమెపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. హెల్త్ ఇష్యూ తప్ప అంతకు మించి ఆమె రాకపోవడానికి ఏ కారణాలు లేవని చెప్పారు.

రోజాపై పుకార్లు షికారు

రోజాపై పుకార్లు షికారు

కాగా, విశాఖలో నిర్వహించిన మహా ధర్నాకు రోజా హాజరుకాకపోవడంపై సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేశాయి. అలాగే, మీడియాలో కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఆమె వైఖరిపై జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారని, తీరు మార్చుకోవాలని వార్నింగ్ కూడా ఇచ్చారని కూడా వార్తలు వచ్చాయి.

రోజా లేని లోటు..

రోజా లేని లోటు..

ఈ కారణంగానే రోజా హాజరు కాలేదని భావించారు. అయితే ఈ వార్తల్లో ఏ మాత్రం వాస్తవం లేదని ఆ తర్వాత వైసిపి వివరణ ఇవ్వడం గమనార్హం. అయితే, ఈ ధర్నాలో ఎమ్మెల్యే రోజా లేని లోటు స్పష్టంగా కనిపించిందని వైసిపి కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు.

జగన్మోహన్ రెడ్డికి

జగన్మోహన్ రెడ్డికి

రోజా తీరు చికాకు తెప్పిస్తోందని, ఆమెకు హెచ్చరికలు జారీ చేశారనే వాదనలు వినిపించాయి. ఆమె తీరు జగన్ ఆగ్రహానికి కారణమయ్యాయని వార్తలు వచ్చాయి. రోజా నిత్యం టిడిపి ప్రభుత్వం, చంద్రబాబుపై పదునైన వ్యాఖ్యలతో విమర్శలు చేస్తుంటారు.

అలాంటి రోజాకు

అలాంటి రోజాకు

అధినేత జగన్ హెచ్చరికలు జారీ చేశారనే ప్రచారం చర్చకు దారి తీసింది. రోజా వ్యవహారశైలి, ఆమె వివాదాస్పద వ్యాఖ్యలపై ఫిర్యాదులు అందడంతో జగన్.. రోజాను పిలిపించి గట్టిగా మందలించినట్లుగా ప్రచారం సాగింది. ఇలా ఆమెను మందలించడం మొదటిసారి కాదని, గతంలోను పలుమార్లు చెప్పారని అంటున్నారు. ఈసారి మరింత ఘాటుగా మందలించారని, అందుకే ఆమె మనస్తాపానికి గురయ్యారని పుకార్లు వినిపించాయి.

English summary
YSR Congress Party clarified why Nagari MLA Roja not attend to Vishaka YS Jagan's maha dharna.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X