వైసీపీ పెద్దాయనకు ఎంత మెజారిటీ, ఆ మండలాల్లో వాషౌట్ ?, చంద్రబాబు స్కెచ్ తో !
ఆంధ్రప్రదేశ్ మంత్రి, వైసీపీ పెద్దాయన పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పోటీ చేసిన చిత్తూరు జిల్లాలోని పుంగనూరు అసెంబ్లీ నియోజక వర్గంలో రాజకీయ వేడి ఏమాత్రం తగ్గడం లేదు. పుంగనూరు నియోజక వర్గంలో వార్ వన్ సైడ్ అయినా టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రా రెడ్డి, సొంత పార్టీ అభ్యర్థి బోడే రామచంద్రా యాదవ్ కు తాము గెలుస్తామని చాలా ధీమాగా ఉన్నారు.
పుంగనూరులో తెలుగుదేశం పార్టీ గెలిచి 20 ఏళ్లు అయిపోయింది. పుంగనూరులో చివరిసారిగా మాజీ మంత్రి ఎన్. అమరనాథ రెడ్డి (ప్రస్తుతం పలమనేరు నుంచి టీడీపీ టిక్కెట్ తో పోటీ చేస్తున్నారు) టీడీపీ నుంచి గెలిచారు. తరువాత పుంగనూరులో ఒకసారి కాంగ్రెస్ కు, ఆ తరువాత వైసీపీకి అడ్డాగా మారిపోయింది. పుంగనూరులో వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధిస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వైసీపీ ప్రభుత్వంలో మంత్రికూడా కావడంతో ఆయన హవా ఎలా ఉందో కొత్తగా చెప్పనసవరంలేదు.

ఇపుడు పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మీద పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రా రెడ్డి అలియాస్ చల్లా బాబు విజయం తనదే అనే ధీమాతో ఉన్నారు. ఇక పెద్దిరెడ్డి మీద మొదటి నుంచి పోరాటం చేసిన బోడే రామచంద్ర యాదవ్ సొంత పార్టీ స్థాపించి పుంగనూరు నుంచి పోటీ చేశారు. పుంగనూరులో యాదవ్ కులస్తుల ఓట్లు భారీగానే ఉండటంతో బోడే రామచంద్ర యాదవ్ ఆ వర్గం ఓట్లు మీద ఆశలు పెట్టుకున్నారు.
పుంగనూరు అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలో చౌడేపల్లె, సదుం, సోమల, పుంగనూరు, పులిచర్ల, రొంపిచర్ల మండలాలు ఉన్నాయి. ఈ మండలాల్లో సదుం, సోమల పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కంచుకోటలుగా ఉన్నాయి. ఈ మండలాల్లో వైసీపీని కాదని కనీసం 10 శాతం ఓట్లు కూడా పక్కకు వెళ్లే అవకాశం లేదు. ఇక పుంగనూరు, చౌడేపల్లి, పులిచర్ల, రొంపిచర్లలో టీడీపీకి ఓటు బ్యాంకు ఉండటంతో టీడీపీ నాయకులు ఆ మండలాల మీద ఆశలు పెట్టుకున్నారు.

పుంగూరులోని పలు వార్డుల్లో టీడీపీ నాయకులు కనీసం ఏజెంట్లను కూడా నిలబెట్టుకోలేకపోయారని వైసీపీ నాయకులు అంటున్నారు. ఇప్పుడు పుంగనూరులోని ఆరు మండలాల్లో ఏమండలంలో ఏ పార్టీకి ఎక్కువ మెజారిటీ వస్తుంది అంటూ బెట్టింగులు కట్టుకునే వరకు వెళ్లారు. టీడీపీ, వైసీపీ, బోడే రామచంద్ర యాదవ్ పార్టీ కార్యకర్తలు డబ్బుతో పాటు బైక్ లు కూడా బెట్టింగ్ లు కడుతున్నారని వెలుగు చూసింది ఇవన్ని లోలోపల సైలెంట్ గా జరిగిపోతున్నాయి.
పుంగనూరులో పలు ప్రాంతాల్లో జనసేన నాయకులు ఉండటంతో ఆ ప్రాంతంలో కొంత వరకు టీడీపీకి ఓట్లు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక పుంగనూరులో ఎవరెవరికి ఎన్ని ఓట్లు వస్తాయి అంటూ అప్పుడే లెక్కలు వేసుకుంటున్నారు. పుంగనూరులో ఉన్న ఒకే ఒక మునిసిపాలిటి అయిన పుంగనూరులోని వార్డుల్లో ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి అంటూ ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు. జూన్ 4వ తేదీన పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి ఎన్ని వేల ఓట్లు వస్తాయి, టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రా రెడ్డికి ఎన్ని వేల ఓట్లు వస్తాయి, బోడే రామచంద్రా యాదవ్ కు ఎన్ని వేల ఓట్లు వస్తాయి అని కచ్చితంగా తెలిసిపోతుంది.
-
Amaravati: అసెంబ్లీలో రాజధాని తీర్మానం-స్పీకర్, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..! -
చంద్రబాబుపై మూడు పిటిషన్లు- హైకోర్టు కీలక నిర్ణయం..! -
ఏపీ ప్రజలకు రూ.11వేలు రాయితీతో ఈ సైకిళ్లు, మిస్ చేసుకోకండి -
AP Govt: ఏపీలో ఇవాళ 2.5 లక్షల మందికి ఇళ్లు-టిడ్కో లబ్దిదారులకూ..! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications