వైసీపీ, టీడీపీ నాయకులను టెన్షన్ పెడుతున్న బెంగళూరు రేవ్ పార్టీ కేసు, లెక్క మారుతుందా ?
బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్న వాళ్లు అడ్డంగా చిక్కిపోవడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులకు, తెలుగు సినీ రంగానికి చెందిన కొందరికి కష్టాలు ఎదురైనాయి. అయితే బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్న వాళ్లకు మీ పార్టీతో సంబంధాలు ఉన్నాయి అంటే, లేదులేదు మీ పార్టీతో సంబంధాలు ఉన్నాయి అంటూ వైసీపీ, టీడీపీ నాయకులు ఒకరిమీద ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు.
బెంగళూరు రేవ్ పార్టీలో ఏ2 ముద్దాయిగా ఉన్న అరుణ్ కుమార్ అలియాస్ అరుణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాకు చెందిన వాడు అని వెలుగు చూడటంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ కలకలం రేపింది. బెంగళూరు రేవ్ పార్టీ నిందితుడు అరుణ్ కుమార్ కు చిత్తూరుకు చెందిన టీడీపీ నాయకులకు సంబంధాలు ఉన్నాయి అంటూ ఇన్ని రోజులు వైసీపీ నాయకులు ఆరోపించారు.

అయితే ఇప్పుడు టీడీపీ ,నాయకులు కథను కొత్త మలుపు తిప్పుతున్నారు. చిత్తూరు జిల్లాలోని తవణంపల్లె మండలం మడవనేరి గ్రామానికి చెందిన అరుణ్ కుమార్ బెంగళూరులోని కోరమంగళలో స్థిరపడి అక్కడే వైద్య రంగానికి చెందిన వ్యాపారం చేస్తున్నాడని టీడీపీ నాయకులు అంటున్నారు. బెంగళూరులో నివాసం ఉంటున్న అరుణ్ కుమార్ కు వైసీపీ సోషల్ మీడియా ఇన్ చార్జ్ భార్గవ్ రెడ్డితో పరిచయాలు అయ్యాయని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
బెంగళూరులోని వైసీపీ నాయకులతో ఉన్న పరిచయాలతో అరుణ్ కుమార్ అన్నమయ్య జిల్లాలోని రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డితో పరిచయం అయ్యిందని, తరువాత ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వ పెద్దలతో అరుణ్ కుమార్ నిత్యం టచ్ లో ఉండేవాడని, ఇలా ఆంద్రప్రదేశ్ లోని వైసీపీ నాయకులతో అతనికి ఆర్థిక సంబంధాలు ఉన్నాయని టీడీపీ నాయకులు ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని పెద్దలతో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా అరుణ్ కుమార్ వైద్య, ఆరోగ్య శాఖలకు చెందిన పలు పనులు దక్కించుకున్నాడని టీడీపీ నాయకులు ఆరోపించారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అరుణ్ కుమార్ కు ఇంకా కొన్ని బిల్లులు రావాల్సి ఉందని టీడీపీ నాయకులు అంటున్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలతో ఉన్న సంబంధాలతో అరుణ్ కుమార్ నిత్యం చిత్తూరు, కడప జిల్లాలకు తిరిగేవాడని తెలిసింది.

బెంగళూరులో వాసు, అరుణ్ కుమార్ నిత్యం టచ్ లో ఉండేవారని, వైద్య రంగానికి చెందిన వ్యాపారం చేస్తున్న అరుణ్ కుమార్, వాసుల స్నేహం రేవ్ పార్టీ నిర్వహించే వరకు వెళ్లిందని ఆరోపణలు ఉన్నాయి, అయితే బెంగళూరు సీసీబీ పోలీసులు కేసు దర్యాప్తు పూర్తి చేసి రేవ్ పార్టీ ప్రధాన నిందితులు ఏం వ్యాపారం చేస్తున్నారు, వాళ్లకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి అని పూర్తి సమాచారం అధికారికంగా వెళ్లడించే వరకు ఈ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చేటట్లు కనిపించడం లేదు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications