శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాస్ట్లీ మద్యం బాటిళ్లలో చీప్ లిక్కర్... ఎపిలో రెచ్చిపోతున్న మద్యం మాఫియా...3 ముఠాలు దొరికాయి...

|
Google Oneindia TeluguNews

అమరావతి: సరదాగానో...అలవాటుగానో కిక్కు కోసం కాస్త ధర ఎక్కువైనా మంచి మందే తాగుదామని ఎపిలో మందుబాబులు కాస్ట్లీ మద్యం బాటిళ్లు కొనుగోలు చేస్తూ చుక్కేస్తున్నారు...కానీ తాము ఖరీదు పెట్టి మరీ తాగిన బ్రాండ్ లో మద్యం మాఫియా చీప్ లిక్కర్ నింపేసిందని తెలిసి...అసలు తామేం తాగామో తెలియక బిక్కమొహం వేస్తున్నాడు.

ఆంధ్రప్రదేశ్ లో ఒకేసారి మూడు ప్రాంతాల్లో లిక్కర్ బాటిళ్లపై బ్రాండెడ్‌ లేబుల్‌ అతికించి వాటిలో చీప్‌ లిక్కర్‌ నింపి అమ్ముకుంటున్న 3 ముఠాలు పట్టుబడటం కలకలం సృష్టిస్తోంది. గుంటూరు జిల్లా రేపల్లె, విశాఖ జిల్లా అనకాపల్లి, శ్రీకాకుళం జిల్లా వీరగట్టంలో ఇలా నకిలీ, కల్తీ మద్యం తయారుచేసి అమ్ముతున్నమూడు ముఠాలు, భారీ డంప్ ల గుట్టురట్టయింది. అంతేకాదు ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల దాడుల్లో ఈ లిక్కర్ మాఫియాకు సంబంధించి దిమ్మతిరిగే నిజాలు చాలా బైటపడినట్లు కూడా తెలుస్తోంది.

సీన్ 1...అనకాపల్లిలో...ముఠా గుట్టు రట్టు....

సీన్ 1...అనకాపల్లిలో...ముఠా గుట్టు రట్టు....

ఖరీదైన మద్యం బాటిళ్లలో సులభంగా చీప్ లిక్కర్ నింపేసి మందుబాబుల జేబులు...ఆరోగ్యం గుల్ల చేస్తున్న మద్యం మాఫియా అనకాపల్లి వింగ్ ముఠా గుట్టు ఎట్టకేలకు రట్టయ్యింది. ఆఫీసర్స్‌ చాయిస్‌ మద్యం బాటిల్ కొంటే...అందులో ఉండేది చీప్‌ లిక్కర్‌...అంతేనా డైరెక్టర్స్‌ స్పెషల్‌లోనూ అదే చీప్!...పెద్ద ఎత్తున ఖాళీ సీసాలు కొనేసి...బ్రాండెడ్‌ లేబుల్స్ అంటించేసి...అందులో చీప్‌ లిక్కర్‌ నింపేసి...తమ గల్లా పెట్టెల్లో మాత్రం నిజమైన డబ్బులతో నింపుకుంటున్న3 మద్యం మాఫియా ముఠాలు మరో రెండు చోట్ల పట్టుబడ్డాయి.

సీన్ 2 అండ్ 3...గుంటూరు...శ్రీకాకుళం...

సీన్ 2 అండ్ 3...గుంటూరు...శ్రీకాకుళం...

గుంటూరు జిల్లా రేపల్లె, విశాఖ జిల్లా అనకాపల్లి, శ్రీకాకుళం జిల్లా వీరగట్టంలో కూడా ప్రాంతాలు మర్పు అయినా ఇవే సీన్లు...అక్కడ కూడా ఇలా నకిలీ, కల్తీ మద్యం తయారుచేసి అమ్ముతున్నముఠాలు, స్థావరాల గుట్టును ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు రట్టు చేశారు. వీళ్లంతా ఒకరికొకరు సహకరించుకుంటూ ఇలా చేస్తున్నారని ప్రాధమికంగా తేలింది. అయితే వీటి వెనుక ఉన్న వ్యక్తుల గురించి కూడా ఆరా తీస్తున్నట్టు ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ కె.వెంకటేశ్వరరావు శుక్రవారం మీడియాకు తెలిపారు.

కల్తీ మద్యం…భారీ డంప్...ఎక్కడంటే...ఎలా చేస్తున్నారంటే...

కల్తీ మద్యం…భారీ డంప్...ఎక్కడంటే...ఎలా చేస్తున్నారంటే...

కల్తీ మద్యం...ఒకటి, రెండు సీసాలు కాదు...వేల సీసాలే...ఏకంగా భారీ డంప్‌ బయటపడింది...ఇది ఎక్కడంటే...రేపల్లె మండలం తుమ్మల సమీపంలోని గాదెవారిపాలెంలోని ఓ నివాసంలో కొద్ది రోజులుగా ఏడుగురు వ్యక్తులు కలసి ఇలా కల్తీ మద్యం తయారు చేసి వైన్ షాపులకు తరలిస్తున్నారు. దీనికోసమే ప్రత్యేకంగా యంత్రాలు సైతం కొనుగోలు చేశారు. అలా ఇప్పటికే 6వేల సీసాల మద్యం తయారుచేసి బయటకు పంపగా, మరో నాలుగువేల సీసాల మద్యం తయారికి ఉపయోగించే ముడిసరకు మాత్రం ఎక్సైజ్‌ అధికారులకు దొరికింది. కొల్లూరుకు చెందిన రమావత్‌ సాంబశివనాయక్‌, రేపల్లెకు చెందిన పూర్ణిమ వైన్స్‌ నిర్వాహకుడు గుమ్మడి సాంబశివరావు కలిసి నకిలీ మద్యంను తయారు చేస్తున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏసీ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.

తయారీ...ఎలా చేస్తున్నారంటే...

తయారీ...ఎలా చేస్తున్నారంటే...

ముందుగా ఇంపీరియల్‌ బ్లూ, ఆఫీసర్స్‌ చాయిస్‌ ఖాళీ సీసాలను సేకరిస్తారు. దీనికో సపరేట్ వ్యవస్థ ఉంది. దీని మూలాలు పాత సామాన్లు కొనే దగ్గర నుంచి ప్రారంభమవుతాయి..అదో సపరేటు మాఫియా...అలా సేకరించిన బాటిళ్ళలో చీప్‌ లిక్కర్‌ నింపుతున్నారు...చీప్‌ లిక్కర్‌ క్వార్టర్ బాటిల్ ధర రూ.50 కాగా...దానిని బ్రాండెడ్‌ సీసాల్లో పోస్తే రెట్టింపు ధరకు అమ్ముకోవచ్చు...ఇందుకోసం ఖర్చు కలసివస్తుందని ఆ బ్రాండ్ల సీసాల మూతలను కూడా వీళ్లే తయారు చేసుకుంటున్నారు. లక్షల సంఖ్యలో మూతలు తయారుచేసి ఒక రాకెట్‌ తరహాలో దీన్ని నడుపుతున్నారు. ఈ మద్యాన్నిఇటీవల శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో పట్టుకున్నారు. దాని తీగ లాగితే డొంక కదిలింది. ఈమేరకు అనకాపల్లి పరిధిలోని యలమంచిలిలో దాడులు చేయగా 60వేల మూతలు దొరికాయి. ఈ మూతలను హైదరాబాద్‌ నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు తేలింది. ఈ ముఠాపై ఎక్సైజ్‌ యంత్రాంగం, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాలు దాడులు చేసి అనంత్‌, గంజి శ్రీనివాస్‌, చల్లా చంద్రశేఖరరెడ్డి, ఓడేపల్లి సూర్యనారాయణ, కె.నాగరాజు తదితరులను అరెస్టు చేశారు.

ఆ ఇల్లు...లిక్కర్ ప్రొడక్షన్ హౌస్

ఆ ఇల్లు...లిక్కర్ ప్రొడక్షన్ హౌస్

గుంటూరు జిల్లా రేపల్లె పరిధిలోని గాదెవారిపాలెంలో ఓ ఇంటినే మద్యం తయారీ కేంద్రంగా మార్చేశారు. ఇక్కడ మద్యం తయారీకి ఉపయోగించే ఈఎన్‌ఏ (ఆల్కహాల్‌)ను ఏకంగా ఆర్డర్ ఇచ్చి ముంబై నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఆ ఈఎన్‌ఏకు రంగు, ఇతర పదార్థాలు కలిపి మద్యాన్ని తయారుచేసి స్థానికంగా మత్య్సకారులు, రోజు కూలీలకు విక్రయిస్తున్నారని తెలిసింది. 200 లీటర్ల సామర్ధ్యం ఉండే డ్రమ్ముల్లో ఈ మద్యాన్ని నింపి విక్రయిస్తున్నారు. ఐదు డ్రమ్ముల మద్యం తయారీకి రూ.4లక్షలు ఖర్చుచేసి.. దానిని రూ.16లక్షలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారంటే వీళ్ల ఆదాయం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. శ్రీలక్ష్మి రోడ్‌వేస్‌ అనే రవాణా సంస్థ ద్వారా ఈఎన్‌ఏను దిగుమతులు చేసుకుంటున్నట్టు విచారణలో తేలింది. భారీ డిస్టిలరీల్లో మద్యం నాణ్యతను ఒకటికి రెండుసార్లు పరీక్షిస్తారు. ఇక్కడ అటువంటివేమీ ఉండవు. ఈ నకిలీ మద్యం తాగితే ప్రాణాలకే ప్రమాదమని వేరేగా చెప్పనక్కరలేదు.

"మరీ మద్యం సిద్ధం చేయడానికి ఉపయోగించిన ఆత్మ ముంబై నుండి దిగుమతి అయ్యిందని రిపల్లెలో మేము గుర్తించాము. సరి అయిన స్టాక్ విజయవాడ, హైదరాబాద్ మరియు ఆదిలాబాద్లకు సరఫరా చేయబడింది. మా పరిశోధన ప్రకారం, ముఠాలు గత రెండు సంవత్సరాలు పనిచేస్తున్నాయి. ఇతర రాష్ట్రాలలో కూడా వారి నెట్వర్క్ను కనుగొనేందుకు మేము ప్రయత్నిస్తున్నాము "అని దర్శకుడు చెప్పారు. "మా జట్లు రాష్ట్రం అంతటా కదులుతున్నాయి మరియు దాడులు కొనసాగుతున్నాయి," అన్నారాయన.

మద్యం మాఫియా...పనిబడతాం...

మద్యం మాఫియా...పనిబడతాం...

"తాము జరిపిన దాడుల్లో కల్తీ, నకిలీ మద్యం మాఫియా గురించి అనేక విషయాలు తెలిసాయి. వీరు నకిలీ మద్యం తయారీకి ఉపయోగించిన ముడి సరుకు ముంబై నుండి దిగుమతి అయ్యిందని రేపల్లెలో జరిగిన దాడుల్లో గుర్తించాము. ఇలా తయారైన స్టాక్ విజయవాడ, హైదరాబాద్ మరియు ఆదిలాబాద్ లకు సరఫరా చేయబడింది. మా విచారణలో తెలిసిందేమంటే ఈ ముఠాలు గత రెండు సంవత్సరాలు ఈ పనిచేస్తున్నాయి. ఇతర రాష్ట్రాలతో కూడా వీళ్ల నెట్ వర్క్,లింక్ లు కనుగొనేందుకు మేము ప్రయత్నిస్తున్నాము...మద్యం మాఫియా పని పట్టేందుకు మా బృందాలు రాష్ట్రం అంతటా జల్లెడపడుతున్నాయి...దాడులు కొనసాగుతాయి,"...అని ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ కె.వెంకటేశ్వరరావు ఈ సందర్భంగా శుక్రవారం మీడియాకు తెలిపారు.

English summary
Officials of the Enforcement wing of the Andhra Pradesh Prohibition and Excise (P&E) Department busted three spurious liquor making rackets at Repalle in Guntur district, Yelamanchili in Visakhapatnam and Veeragatam in Srikakulam district within a span of a few days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X