రాముడ్ని కాపాడుకుంటాం: మల్లుభట్టి, మనదని కావూరి

భద్రాచలం ఎప్పుడు తెలంగాణదే అని కేంద్రమంత్రి బలరాం నాయక్ అన్నారు. గతంలో నిజాం రాజు రాముల వారికి తలంబ్రాలు పంపించే వారని, ఇప్పటికీ అదే ఆచారం కొనసాగుతోందన్నారు. నిజాం తలంబ్రాలే ప్రస్తుతం మన ముఖ్యమంత్రులు మోస్తున్నారని చెప్పారు.
భద్రాచలం సీమాంధ్రలోనే: కావూరి
విభజన తప్పనిసరి అయితే భద్రాచలం డివిజన్ సీమాంధ్రలోనే ఉంటుందని కేంద్ర జౌళీ శాఖ మంత్రి కావూరి సాంబశివ రావు పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో అన్నారు. రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న ఆయనకు సమైక్య సెగ తగిలింది. ఆయన కాన్వాయ్‌ను సమైక్యవాదులు అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. పోలీసులు వారిని చెదరగొట్టారు.
ఈ సందర్భంగా కావూరి మాట్లాడారు. సీమాంధ్ర మంత్రులతో కలిసి మంత్రుల బృందానికి(జివోఎం)కు సమైక్యవాణి వినిపిస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఖాయమన్నారు. భద్రాచలం సీమాంధ్రలోనే ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications