భద్రాద్రి రామయ్య ఎవరివాడు: నిరసనలు (ఫోటోలు)
ఖమ్మం: రాష్ట్ర విభజన నేపథ్యంలో భద్రాచలంపై వివాదం చోటు చేసుకుంది. భద్రాచలం సీమాంధ్రలో ఉండాలని ఆ ప్రాంత నాయకులు అడుగుతుంటే, తెలంగాణకే ఆ ప్రాంతం చెందుతుందని ఈ ప్రాంతంవారు అంటున్నారు. మొత్తంగా, భద్రాద్రి రాముడు వివాదంలో చిక్కుకున్నాడు. భద్రాచలం మొదట్లో తెలంగాణలో ఉండేది. అయితే, భద్రచలానికి చెందిన కొంత ప్రాంతాన్ని నిజాం బ్రిటిష్ వారికి ఇచ్చాడు. అప్పుడు ఆందోళనలు చెలరేగడంతో భద్రాచలం రామలయం మాత్రం హైదరాబాదు రాజ్యంలో ఉండే విధంగా చూసుకున్నాడు.
భద్రాచలంలోని రామాలయాన్ని రామదాసుగా పేరు పొందిన కంచెర్ల గోపన్న నిర్మించాడు. ప్రభుత్వ సొమ్ముతో అతను ఆ ఆలయాన్ని కట్టించినందుకు నిజాం ప్రభువు ఆయనను జైలులో కూడా పెట్టాడు. రాష్ట్ర విభజన నేపథ్యంలో భద్రాచలం ఏ రాష్ట్రంలో ఉండాలనే వివాదం సాగుతోంది. ఇందుకు సంబంధించి ఖమ్మం జిల్లాలో ఆందోళనలు సాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోనే భద్రచలాన్ని ఉంచాలని వారు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఇటీవల రెండు రోజుల బంద్ కూడా నిర్వహించారు. ఖమ్మం జిల్లాకు చెందిన రాజకీయ నాయకులు కూడా భద్రాచలం తెలంగాణలోనే ఉండాలని వాదిస్తున్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రుల బృందానికి (జివోఎంకు) విజ్ఞప్తులు కూడా చేశారు.

జర్నలిస్టుల ప్రదర్శన
భద్రాద్రి మాదే, రాముడు మావాడే అంటూ ఖమ్మం జిల్లా జర్నలిస్టులు ప్రదర్శన నిర్వహించారు. బ్యానర్‌తో ఊరేగింపు నిర్వహించారు.

బలరాం నాయక్ వాదన..
భద్రాచలం తెలంగాణలో భాగమని, ఆ ప్రాంతం ఖమ్మం జిల్లాలోనే ఉండాలని కేంద్రమంత్రి బలరాం నాయక్ అన్నారు. జీవోఎంతో భేటీ అనంతరం ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. భద్రాచలాన్ని సీమాంద్రలో కలిపేందుకు స్థానికులు ఒప్పుకోరని ఆయన తెలిపారు. అందుకు అనుగుణంగానే ఖమ్మం జిల్లా జర్నలిస్టులు నినదించారు.

జైపాల్ రెడ్డి వాదనా అదే..
భద్రాచలం ఖమ్మం జిల్లాలో భాగమని, భద్రాచలంతో పాటు పది జిల్లాల సంపూర్ణ తెలంగాణ కావాలని జీవోఎంను కోరినట్లు తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి సోమవారం మీడియాతో చెప్పారు. జర్నలిస్టులు అందుకు అనుగుణంగా ఇలా ప్రదర్శన నిర్వహించారు.

భద్రాచలంపై కావూరి వాదన
రాష్ట్రం విడిపోతే భద్రాచలం డివిజన్ పూర్తిస్థాయిలో ఆంధ్ర ప్రాంతానికి రావాలని కేంద్ర జౌళిశాఖ మంత్రి కావూరు సాంబశివరావు అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి ఢిల్లీలో సోమవారం జరిగే సమావేశాల్లో గట్టిగా తన వాదన వినిపిస్తానని చెప్పారు. ఆదివారంనాడు పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం పర్యటనలో ఆ మాట అన్నారు. అయితే, తెలంగాణ న్యాయవాదులు మాత్రం భద్రాచలం ప్రాంతాన్ని తెలంగాణలో కలపాలని ఇలా దీక్షలు చేపట్టారు.

భద్రాచలం కోసం ఇలా ..
భద్రాచలం ఖమ్మం జిల్లాలోనే ఉండాలని, ఆ రకంగా అది తెలంగాణ రాష్ట్రంలోనే ఉండాలని డిమాండ్ చేస్తూ ఇలా వీధులపైకి వచ్చారు.

మానవహారం..
భద్రాద్రి రాముడి కోసం ఖమ్మం జిల్లా ప్రజలు ఇలా వీధుల మీదికి వచ్చి మానవ హారం నిర్మించారు. భద్రాద్రి రాముడు ఖమ్మం జిల్లాకే చెందినవాడని వారు వాదిస్తున్నారు.

ఉద్యోగులు కూడా...
భద్రాచలం ఖమ్మం జిల్లాలోనే ఉండాలని కోరుతూ ఖమ్మం జిల్లా పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు.












Click it and Unblock the Notifications