ఏపీ భవన్ ప్రిన్సిప్ల రెసిడెంట్ కమిషనర్‌గా భావనా సక్సేనా: సర్కారు ఉత్తర్వులు
న్యూఢిల్లీ/అమరావతి: దేశరాజధాని న్యూఢిల్లీలోని ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్‌గా భావనా సక్సేనా నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం భావనా సక్సేనాకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా భావనా సక్సేనా కొనసాగుతుండగా, అభయ్ త్రిపాఠీ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్‌గా కొనసాగుతున్నారు. జులై 31న అభయ్ త్రిపాఠి ఉద్యోగ విరమణ చేయనున్న నేపథ్యంలో సక్సేనాకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వాలు జారీ చేసింది.

ఏపీ సీడ్స్‌కు జాతీయ అవార్డు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ (ఏపీ సీడ్స్)కు సామజిక బాధ్యత కింద జాతీయ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు హర్షం వ్యక్తం చేశారు. సర్టిఫైడ్ విత్తనాలను ఖరీఫ్ సీజన్‌కు ముందే పంపిణీ చేసి.. రైతుల ఆదరణను ప్రభుత్వం చూరగొందన్నారు.
రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రవాణా ఖర్చుల భారం లేకుండా ఊళ్లోనే విత్తనాలు అందజేశామని చెప్పారు. విత్తన పంపిణీ వల్ల 20 లక్షల మంది రైతులకు లబ్ధి చేకురిందన్నారు. వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనమ్ మాలకొండయ్య, కమిషనర్ అరుణ్ కుమార్, సీడ్స్ ఎండీ శేఖర్ బాబు ఇతర సిబ్బందిని మంత్రి కన్నబాబు అభినందించారు.












Click it and Unblock the Notifications