కొడాలి నాని - వెల్లంపల్లితో సినిమాలు.. : మమ్మల్ని విడదీసే దమ్ముందా : నాగబాబు ఫైర్..!!
వైసీపీ ప్రభుత్వ తీరుపైన మెగా బ్రదర్ నాగబాబు మరోసారి ఫైర్ అయ్యారు. సినిమా పరిశ్రమ పైన ప్రభుత్వ తీరును తప్పు బట్టారు. హీరో రెమ్యునరేషన్ లేకుండా..సినిమా ఖర్చును పరిగణలోకి తీసుకోవటం అవగాహన రాహిత్యంగా పేర్కొన్నారు. సినిమా ఎలా పని చేస్తుందో, దాని కార్యకలాపాలు ఎలా ఉంటాయో తెలియదని అజ్ఞాని వైఎస్సార్సీపీ అని అన్నారు. గతంలో ఎంత మంది హీరోలు ఉద్దేశపూర్వకంగా తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నారో లేదా కొంత మందిని వాపసు చేశారనే దానిపై పార్టీ వ్యక్తుల వద్ద ఎటువంటి డేటా లేదన్నారు.

హీరోలు రెమ్యునరేషన్లపైనా
అత్తారింటికి దారేది సినిమా ఇంటర్నెట్‌లో లీక్ అయినప్పుడు నిర్మాతకు సహాయం చేయడానికి పవన్ తన రెమ్యునరేషన్ తగ్గించుకున్నారని వివరించారు. చిరంజీవి కూడా అంజి కోసం తన రెమ్యూనరేషన్‌ను వదిలేసారన్నారు. మహేష్ బాబు, తారక్, వరుణ్ తేజ్, చరణ్ లు కూడా సినిమా హిట్ అయితే రెమ్యూనరేషన్ పూర్తిగా తీసుకుంటారని వెల్లడించారు. సినిమాల కోసం శారీరకంగా ఎన్నో గాయాలను హీరోలు ఎదుర్కొన్నారని..అవే వైసీపీ నేతలకు అయి ఉంటే ఏడాది పాటు ఐసీయూలో ఉండాల్సి వచ్చేదని చెప్పుకొచ్చారు.
వైసీపీలో పాలన ఎలా ఉందో రోడ్ల మీద వెళ్తుంటే తెలుస్తుందని వ్యాఖ్యానించారు. వైసీపీకి ఇచ్చిన అయిదేళ్ల కాలంలో మరో రెండేళ్లు మాత్రమే ఉందని.. ముఖ్యమంత్రి జగన్ వేధింపులు కాకుండా ప్రజా పాలన చేయాలని సూచించారు.

ఆ ఇద్దరు మంత్రులు హీరోలుగా
వెల్లంపల్లి శ్రీనివాస్.. కొడాలి నాని వంటి ఆర్టిస్టులతో మీరే సినిమాలు తీయండి..వాళ్లు మా కంటే బాగా నటిస్తారని వ్యాఖ్యానించారు. ఇక మీ ప్రభుత్వంలో అంత బాగా నటించే హీరోయిన్లు లేరు. కాస్త కష్టమే అయినా రెమ్యూనరేషన్ పే చేస్తే దొరుకుతారని సలహా ఇచ్చారు. మా అన్నదమ్ముల మధ్య గొడవ పెట్టే దమ్ముందా మీకు అంటూ నాగబాబు ప్రశ్నించారు. వైసీపీ నేతలకు ఉన్న వ్యక్తిగత అజెండాలతో..ఆర్దిక మూలాలు దెబ్బ తీస్తే పవన్ ను తొక్కేయేచ్చనో అనుకుంటున్నారని..అది సాధ్యపడదని చెప్పుకొచ్చారు. సినిమా వాళ్లకు అనేక మార్గాలు ఉన్నాయని..డిజిటల్ ప్లాట్ ఫాం ద్వారా సంపాదన ఉందని వివరించారు.

సినీ పరిశ్రమను మీరే తీసుకోండి
ఏ వ్యాపారాన్ని అయినా మీ చేతుల్లోకి తీసుకుంటున్నారు కదా.. సినిమా పరిశ్రమను తీసుకోండంటూ సవాల్ చేసారు. ఏపీలో సినిమా పరిశ్రమను బ్యాన్ చేయండని వ్యాఖ్యానించారు. తమకు ఏపీ - తెలంగాణ కీలకమని చెప్పుకొచ్చారు. చిరంజీవి తన ఆత్మగౌరవం పక్కన పెట్టి..సినీ పరిశ్రమ కోసం సీఎం వద్దకు వెళ్లి సమస్యలు చర్చించారని.. సీఎం సైతం సానుకూలంగా స్పందిచారని పేర్కొన్నారు.
అయిదే, జీవో ఇవ్వటానికి ఏంటి బాధ అని ప్రశ్నించారు. పాత జీవోలను అమలు చేయకుండా.. మధ్యలో తెచ్చిన జీవో చెల్లదని తెలిసి దాని ప్రకారమే టికెట్లు అమ్మటం ఏంటని నిలదీసారు. ఇలాంటి కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడితే..తాను..పవన్ కళ్యాణ్ వచ్చి మిమ్మల్ని బతిమిలాడుతామని అనుకుంటున్నారాన..అది జరగదని నాగబాబు స్పష్టం చేసారు.

పవన్ - నేను మిమ్మల్ని బతిమాలాడుకోం
అఖండ.. పుష్ఫ సినిమాల గురించి వైసీపీ నేతలు ప్రస్తావిస్తున్నారని..అవి కూడా టికెట్ ధరలు పెంచి ఉంటే మరింత కలెక్షన్లు వచ్చేవన్నారు. వారు మాట్లాడకపోవటం అది వారి వ్యక్తిగతమని చెప్పారు. సినిమా పరిశ్రమకు రాజకీయాలతో సంబంధం ఉండదని.. అందరం కలిసి ఉందామని పిలుపునిచ్చారు మెగా ఫ్యాన్స్ ఆవేశ పడవద్దని..ఆవేశం దాచుకోవాలని చెబుతూ.. అవసరం వచ్చిన సమయంలో ఉపయోగిద్దామని వ్యాఖ్యానించారు. కాలం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదంటూ నాగబాబు చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications