అక్కడ దహనక్రియలు: భూమి పూజ స్థలం మార్పు?
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని భూమి పూజకు నిర్ణయించిన వేదిక మారే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఆ విషయంపై స్థానికంగా ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఎపి రాజధాని అమరావతికి జూన్ 6న భూమి పూజ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.
దీనికోసం మందడం శివారు తాళ్లాయపాలెం వద్ద జడ్పీటీసీ నరేంద్రబాబు ఆయన బంధువులకు చెందిన సర్వే నెం.134, 136లోని 20 ఎకరాలకుపైగా భూమిని వేదికగా నిర్ణయించారు. ఈ నిర్ణయానికి ముందు అక్కడ జరిగిన ఓ సంఘటన గురించి వారు దాచిపెట్టినట్లు ప్రచారం సాగుతోంది.

ఈ నెల 14న నరేంద్రబాబు సమీప బంధువు బెజవాడ వెంకటేశ్వరరావు సతీమణి ధనలక్ష్మి మృతిచెందారు. రాజధాని భూమిపూజకు వేదికగా నిర్ణయించిన సర్వే నెం.134లోని తమ సొంత భూమిలో కుటుంబసభ్యులు ఆమె భౌతికకాయానికి 15న దహన క్రియలు నిర్వహించారు. అప్పటికింకా భూమిపూజ కోసం ఇంకా ఏ ప్రాంతాన్ని ఎంపిక చేయలేదు.
కానీ ప్రభుత్వం ఇదే భూమిని ఎంపికచేసే ముందర ఆ ప్రజాప్రతినిధి ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లకుండా మరుగుపరిచారు. విషయం తెలియని ప్రభు త్వం అక్కడే భూమి పూజ జరుగుతుందని ప్రకటించింది. కానీ, ఈ విషయం గురువారం ఒకరిద్దరు మంత్రుల దృష్టికి వెళ్లింది. వారు దీన్ని ధ్రువీకరించుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దాంతో భూమి పూజ జరిపే స్థలాన్ని మారుస్తారనే ప్రచారం సాగుతోంది.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications