ఏపీ ప్రజలకు అదిరిపోయే శుభవార్త
మారుతున్న కాలానికి అనుగుణంగా తనను తాను మార్చుకుంటూ, ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలను కల్పిస్తూ భారతీయ రైల్వే ముందుకెళుతోంది. ఈ క్రమంలోనే దేశంలోని ప్రధాన నగరాల మధ్య దూరాన్ని సాధ్యమైనంత తక్కువ సమయంలో అందుకునేలా సెమీ హైస్పీడ్ రైళ్లయిన వందేభారత్ ను ప్రవేశపెట్టింది. ఛార్జీలు ఎక్కువగా ఉంటున్నాయనే ఫిర్యాదు మినహా ఈ రైలు ప్రయాణికులకు భాగా ఆకట్టుకుంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం సికింద్రాబాద్-విశాఖపట్నం, సికింద్రాబాద్-తిరుపతి మధ్య రెండు వందే భారత్ సర్వీసులు నడుస్తున్నాయి. విజయవాడ-చెన్నై మధ్య త్వరలోనే మరో వందే భారత్ అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో భువనేశ్వర్-విశాఖపట్నం మధ్య కూడా మరో వందే భారత్ రైలు ప్రవేశపెట్టబోతున్నారు. ఈ రైలుకు శ్రీకాకుళం రోడ్డు స్టేషన్ లో నిలిపేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కలిసి వినతిపత్రం అందజేశారు.

దీంతో విశాఖ-భువనేశ్వర్ మధ్య మరో వందే భారత్ రాబోతోందని స్పష్టమైంది. మంత్రిని కలిసిన సమయంలో ఎంపీ.. వైజాగ్ నుంచి కాశీ మధ్య నడుస్తున్న వీక్లీ రైలును రెగ్యులర్ చేయాలని కోరారు. వీటితోపాటు విశాఖ-పలాస మెమూను ఇచ్ఛాపురం వరకు, భువనేశ్వర్-పలాస మధ్య మెమూను శ్రీకాకుళం రోడ్డువరకు పొడిగించాలని మంత్రిని కోరారు.

కొద్దిరోజుల క్రితం శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్‌లో వందేభారత్ రైలు వచ్చి అగడంతో.. ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారని చర్చించుకున్నారు. రాత్రి వేళ ఈ స్టేషన్ లో వందే భారత్ ఆగినప్పుడు ప్రయాణికులు ఆ రైలును చూడటానికి క్యూలు కట్టారు. తాజాగా మంత్రిని కలిసి ఎంపీ విన్నవించడంతో అధికారికంగా ప్రకటించడమే తరువాయిగా మిగిలింది.












Click it and Unblock the Notifications