వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిరుద్యోగ యువతను రౌడీలుగా మారుస్తున్నారని ఫైర్ అయిన భూమా అఖిల ప్రియ

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఏపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. జగన్ సర్కార్ పై విరుచుకుపడుతున్నారు. నిరుద్యోగ యువతను జాబ్ క్యాలెండర్ పేరుతో మోసం చేస్తున్నారని పేర్కొన్న భూమా అఖిలప్రియ రాష్ట్రంలో ఉద్యోగాల పేరుతో యువతను తప్పుదోవ పట్టించి రౌడీలుగా మారుస్తున్నారని మండిపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచకాలు పెరిగాయని చెప్పిన భూమా అఖిలప్రియ ఈరోజు చాగలమర్రిలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు.

పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలకు భూమా కుటుంబం అండగా ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. ఆళ్లగడ్డ నియోజకవర్గ టిడిపి శ్రేణులు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు భూమా అఖిలప్రియ. ఇక రాష్ట్రంలో ప్రభుత్వ పాలన మద్యం ద్వారా వచ్చిన డబ్బులతో చేయడం సిగ్గుచేటని భూమా అఖిలప్రియ విమర్శలు గుప్పించారు. ఇక ఇటీవల కాలంలో భూమా అఖిలప్రియ పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం లేదు.

Bhuma Akhila Priya fires on ap govt over unemployed youth are being turned into rowdies

అఖిల ప్రియతో పాటు భర్త భార్గవ్ రామ్, అతని సోదరుడు, భూమా అఖిలప్రియ అనుచరులపై బోయినపల్లి ప్రదీప్ రావు సోదరులపై కిడ్నాప్ కేసు నమోదు అయిన తర్వాత అఖిల ప్రియ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇక ఇటీవల భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్, అతని సోదరుడు జగద్విఖ్యాత్ రెడ్డిలపై కరోనా ఫేక్ సర్టిఫికెట్ కోర్టులో దాఖలు చేసినందుకు మరో కేసు కూడా నమోదైంది. ఇదంతా పక్కా ప్లాన్ తో కుట్రలో భాగంగా చేస్తున్నారని భూమా అఖిలప్రియ ఆరోపించారు. ఇక తాజాగా ఇప్పుడిప్పుడే మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ భూమా అఖిలప్రియ యాక్టివ్ అవుతున్నారు.

English summary
TDP leader and former minister Bhuma Akhilapriya has lashed out at the AP government over the latest situation in the state of Andhra Pradesh. Bhuma Akhilapriya, who claimed that unemployed youth were being cheated in the name of job calendar, was incensed that youth were being misled and turned into rowdies in the name of jobs in the state. Bhuma Akhilapriya, who said anarchy had increased after the YSR Congress party came to power, attended a meeting in Chagalamarri today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X