నంద్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీడీపీని వీడి జనసేనలో చేరుతున్నారా?: భూమా అఖిలప్రియ ఏమన్నారంటే..?

|
Google Oneindia TeluguNews

అమరావతి: కర్నూలు జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియ తెలుగుదేశం పార్టీని వీడుతున్నారంటూ ప్రచారం కలకలం రేపుతోంది. టీడీపీ రాజీనామా చేసి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీలో చేరుతున్నారంటూ ప్రచారం జరిగింది. దీంతో ఈ విషయం టీడీపీలో చర్చనీయాంశంగా మారింది.

మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి భూమా కుటుంబానికి మధ్య మొదట్నుంచి రాజకీయంగా సన్నిహిత సంబంధాలున్నాయి. దివంగత నేతలు భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి దంపతులు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేశారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా శోభానాగిరెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో భూమా దంపతులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

అనంతరం చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, భూమా నాగిరెడ్డి గుండెపోటుతో మరణించారు. ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వంలో భూమా అఖిలప్రియ మంత్రిగా కూడా పనిచేశారు.

 Bhuma Akhila Priya response on Party change rumours

కాగా, చిరంజీవి సోదరుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో కూడా భూమా కుటుంబం
సన్నిహిత సంబంధాలే కొనసాగిస్తోంది. ఇక ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉండటంతో జనసేనలో చేరితో గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండనున్నాయని భూమా కుటుంబం భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అంతేగాక, సోషల్ మీడియాలోనూ భూమా అఖిలప్రియ జనసేన పార్టీలో చేరబోతున్నారంటూ విస్తృత ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం భూమా అఖిలప్రియ గర్భవతిగా ఉండటంతో ఆమె సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి రాజకీయంలో యాక్టివ్‌గా ఉంటున్నారు. కాగా, జనసేన పార్టీలో చేరుతున్నారంటూ వస్తున్న వార్తలపై తాజాగా భూమా అఖిలప్రియ స్పందించారు.

తాము టీడీపీలోనే కొనసాగుతామని, జనసేన పార్టీలో చేరతామంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని భూమా అఖిలప్రియ సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చారు భూమా అఖిలప్రియ. దీంతో భూమా కుటుంబం మారుతుందంటూ జరుగుతున్న ప్రచారానికి తెరపడినట్లయింది.

English summary
Bhuma Akhila Priya response on Party change rumours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X