జగన్ పాదయాత్రతో ఇబ్బంది లేదు: అఖిలప్రియ

Subscribe to Oneindia Telugu

కర్నూలు/చిత్తూరు: జిల్లాలో కొనసాగుతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్రపై ఏపీ పర్యటక శాఖ మంత్రి భూమ అఖిలప్రియ స్పందించారు. శనివారం శ్రీశైలం భ్రమరాంబమల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు.

 bhuma akhilapriya on YS Jagan's Padayatra

భక్తుల కోసం శ్రీశైలంలో రూ.6కోట్లతో లైటింగ్, సౌండ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశామని అన్నారు. రాష్ట్రంలో టూరిజం శాఖను అభివృద్ధి చేసేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తామని స్పష్టం చేశారు.

కాగా, జగన్ పాదయాత్రతో తమకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని అఖిలప్రియ అన్నారు. ఆలయానికి విచ్చేసే భక్తుల కోసం టూరిజంశాఖ అన్ని వసతులు కల్పిస్తుందని తెలిపారు. కాగా అఖిలప్రియతో పాటు కేంద్రమంత్రి మహేష్‌శర్మ కూడా స్వామిని దర్శించుకున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh minister Bhuma Akhilapriya on Saturday responded on YSRCP president YS Jagan's Padayatra.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి