మా వాళ్లనే పంపేస్తారా?: భూమా మౌనిక హల్‌చల్, శిల్పాను అడ్డుకోవడంతో..
నంద్యాల ఉప ఎన్నికలు ఉద్రిక్తంగా మారుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా అధికార, విపక్షాల నేతలు పోలింగ్ బూత్‌లలోకి వెళ్తున్నారు. దీంతో పోలీసులు వారిని బలవంతంగా బయటకు తీసుకు వస్తున్నారు.
నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికలు ఉద్రిక్తంగా మారుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా అధికార, విపక్షాల నేతలు పోలింగ్ బూత్‌లలోకి వెళ్తున్నారు. దీంతో పోలీసులు వారిని బలవంతంగా బయటకు తీసుకు వస్తున్నారు.
టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి సోదరి భూమా నాగ మౌనిక పోలింగ్ బూత్‌ల వద్ద హల్‌చల్ చేస్తున్నారు. ఉదయం నుంచి మౌనికా రెడ్డి పోలింగ్ బూత్‌లు తిరుగుతున్నారు.

అనుచరులతో కలిసి మౌనికా రెడ్డి హల్‌చల్
మధ్యాహ్నం సెయింట్ జోసఫ్ హైస్కూల్ పోలింగ్ బూత్‌కు నాగ మౌనిక వెళ్లారు. ఆమె అనుచరులతో కలిసి లోనికి వెళ్లారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. భూమా అనుచరులను పోలీసులు బయటకు పంపించారు.

మా నాయకులను బయటకు పంపిస్తారా?
తమ పార్టీ నాయకులను బయటకు పంపించడంపై భూమా నాగ మౌనిక మండిపడ్డారు. మా నాయకులనే బయటకు పంపిస్తారా అని పోలీసులను నిలదీశారు. మౌనిక పోలింగ్ బూత్‌లలోకి వెళ్లి ఏజెంట్లను ప్రభావితం చేస్తున్నారని ఇప్పటికే నైసిపి నేతలు ఆరోపిస్తున్నారు.

శిల్పా మోహన్ రెడ్డి కూడా
నంద్యాల బస్టాండ్ దగ్గర బాలికల పాఠశాల పోలింగ్ బూత్‌లోకి తన అనుచరులతో వెళ్లేందుకు వైసిపి అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి ప్రయత్నించారు. అయితే పోలీసులు అడ్డుకున్నారు. అనుచరులను అనుమతించేది లేదని చెప్పారు. అభ్యర్థిని మాత్రమే అనుమతిస్తామని చెప్పడంతో ఆయన ఒక్కరే లోనికి వెళ్లారు.

భన్వర్ లాల్‌కు వైసిపి ఫిర్యాదు
కోడ్ ఉల్లంఘిస్తూ టిడిపి నేతలు నంద్యాలలోనే మకాం వేశారని వైసిపి నేతలు ఈసీ భన్వర్ లాల్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

జగన్‌పై రెండు రోజుల క్రితం నోటీసులు ఇస్తే..
సీఈసీ ఈ నెల 21న జగన్ విషయంలో నోటీసులు ఇస్తే ఓటర్లను ప్రభావితం చేసేలా పోలింగ్ రోజున ఎలా విడుదల చేస్తారని ప్రశ్నించారు. మౌనికా రెడ్డి పోలింగ్ బూత్‌లోకి వెళ్లారని, ఓటర్లను, పోలింగ్ బూత్ ఏజెంట్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టాలన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications