వైసీపీకి ఊరట: భూమా నాగిరెడ్డికి బెయిల్
కర్నూలు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల శాసన సభ్యుడు భూమా నాగి రెడ్డికి బుధవారం నాడు బెయిల్ మంజూరు అయింది. కర్నూలు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల విధులకు ఆటంగం కలిగించారంటూ టాస్క్ ఫోర్స్ డీఎస్పీ దేవదానం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 4న అతనిని అరెస్టు చేశారు.
సెక్షన్ 353, 188, 506 ఐపీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. భూమా అరెస్టు పైన వైసీపీ నేతలు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు బుధవారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో భూమా అఖిల ప్రియ ఓటు వేసి వచ్చిన సమయంలో పోలీసులకు, ఆమెకు వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమయంలో భూమా నాగిరెడ్డికి, పోలీసులకు వాగ్వాదం జరిగింది. తమ విధులకు ఆటంకం కలిగించాలని కేసు నమోదు చేశారు.
భూమా నాగిరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆరోగ్య కారణాల వల్ల ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనను మంగళవారం నాడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు.












Click it and Unblock the Notifications