కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌కు షాక్: టిడిపిలోకి భూమా, అఖిలప్రియ సహా ఐదుగురు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మూడు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. తెలుగుదేశం పార్టీలోకి వైయస్సార్ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు.

నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌తో పాటు ఎమ్మెల్సీ నారాయణరెడ్డిలు సోమవారం టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.

కలిసి పనిచేయాలి.. అండగా ఉంటా

సోమవారం సాయంత్రం వరకూ కలెక్టర్ల సదస్సుల్లో పాల్గొన్న చంద్రబాబు రాత్రి 8గంటల సమయంలో నేరుగా టిడిపి కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడున్న జమ్మలమడుగు నేత రామసుబ్బారెడ్డితో, పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు.
15నిమిషాల పాటు నేతలతో చర్చించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. అనంతరం మాట్లాడుతూ.. అన్నింటికీ తాను అండగా ఉంటానని, మీ భవిష్యత్తును చూసుకుంటానని తెలిపారు.

తొలి నుంచి పార్టీలో ఉన్న వారి గౌరవానికి భంగం లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని వారికి భరోసా ఇచ్సారు. సమావేశం అనంతరం రామసుబ్బారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. ఊపిరి ఉన్నంత వరకూ చంద్రబాబుతోనే ఉంటానని చెప్పారు. పార్టీ కోసం ఆయన తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రకటించారు.

బాబు సమక్షంలో టిడిపిలో చేరిక

బాబు సమక్షంలో టిడిపిలో చేరిక

మూడు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. తెలుగుదేశం పార్టీలోకి వైయస్సార్ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

బాబు సమక్షంలో టిడిపిలో చేరిక

బాబు సమక్షంలో టిడిపిలో చేరిక

నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌తో పాటు ఎమ్మెల్సీ నారాయణరెడ్డిలు సోమవారం టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.

బాబు సమక్షంలో టిడిపిలో చేరిక

బాబు సమక్షంలో టిడిపిలో చేరిక

అంతకు ముందు ఉదయం నుంచి కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. హైదరాబాద్‌లో జరిగిన పీఏసీ సమావేశంలో పాల్గొన్న భూమా నాగిరెడ్డి ఆ సమావేశం ముగిసిన వెంటనే తన కుమార్తె, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియతో కలిసి నేరుగా విజయవాడకు బయల్దేరారు.

బాబు సమక్షంలో టిడిపిలో చేరిక

బాబు సమక్షంలో టిడిపిలో చేరిక

అదే సమయంలో విజయవాడలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సు భోజన విరామ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఏపీ టిడిపి అధ్యక్షుడు కళా వెంకట్రావు భేటీ అయ్యారు.

బాబు సమక్షంలో టిడిపిలో చేరిక

బాబు సమక్షంలో టిడిపిలో చేరిక

పార్టీలో చేరికల పైన ఆయనతో సుదీర్ఘంగా చర్చించారు. చంద్రబాబు అనుమతి లభించిన వెంటనే పరిణామాలు వేగం పుంజుకున్నాయి.

బాబు సమక్షంలో టిడిపిలో చేరిక

బాబు సమక్షంలో టిడిపిలో చేరిక

జమ్మల మడుగు నియోజకవర్గ టిడిపి నేత రామసుబ్బారెడ్డి, ఆయన వర్గీయులు, కర్నూలు జిల్లా నుంచి శిల్పా మోహన్‌రెడ్డి, చక్రపాణిరెడ్డి ఆయన అనుచరులు కూడా పెద్ద ఎత్తున విజయవాడకు చేరుకున్నారు.

బాబు సమక్షంలో టిడిపిలో చేరిక

బాబు సమక్షంలో టిడిపిలో చేరిక

సోమవారం సాయంత్రం వరకూ కలెక్టర్ల సదస్సుల్లో పాల్గొన్న చంద్రబాబు రాత్రి 8గంటల సమయంలో నేరుగా టిడిపి కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడున్న జమ్మలమడుగు నేత రామసుబ్బారెడ్డితో, పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు.

బాబు సమక్షంలో టిడిపిలో చేరిక

బాబు సమక్షంలో టిడిపిలో చేరిక

చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, కింజరాపు అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, పల్లె రఘునాథరెడ్డి, కొల్లు రవీంద్ర తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

బాబు సమక్షంలో టిడిపిలో చేరిక

బాబు సమక్షంలో టిడిపిలో చేరిక

ఈ సందర్భంగా అనేక సంవత్సరాలుగా తాము ఎదుర్కొన్న కష్టనష్టాలను, పార్టీ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టిన తీరును వారు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఎవరిపైనైతే పోరాడామో వారినే పార్టీలోకి చేర్చుకుంటే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.

బాబు సమక్షంలో టిడిపిలో చేరిక

బాబు సమక్షంలో టిడిపిలో చేరిక

పదిహేను నిమిషాల పాటు చర్చించిన ముఖ్యమంత్రి అన్నింటికీ తాను అండగా ఉంటానని, మీ భవిష్యత్తును చూసుకుంటానని, తొలి నుంచి పార్టీలో ఉన్న వారి గౌరవానికి భంగం లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని వారికి భరోసా ఇచ్చారు.

అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం

అభివృద్ధి కోసమే తాము పార్టీ మారినట్లు వైకాపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ప్రకటించారు. సీఎం సమక్షంలో సోమవారం రాత్రి తెదేపాలో చేరిన వైకాపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వాల హయాంలో తన నియోజకవర్గం నంద్యాల ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని భూమా నాగిరెడ్డి అన్నారు. ప్రస్తుతం చంద్రబాబు అభివృద్ధి చేస్తారనే నమ్మకం ఉందన్నారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగితే భవిష్యత్తు కనిపించటం లేదని, కార్యకర్తలు సైతం అలసిపోయారని వ్యాఖ్యానించారు. వారు కూడా పార్టీ మారేందుకు మొగ్గు చూపారని తెలిపారు. ఇదే సరైన సమయని భావించి టిడిపిలోకి వచ్చామని చెప్పారు. ఇంకా ఎందరు, ఎలా వస్తారో కాలమే నిర్ణయిస్తుందన్నారు. తాను మంత్రి పదవి ఆశించి ఉంటే ఎప్పుడే వచ్చేదని, ప్రగతి కోసమే బయటి కొచ్చానని చెప్పారు.

తమ రాకతో టిడిపి బలపడుతుందని అభిప్రాయపడ్డారు. సర్దుబాట్లను పార్టీ నాయకత్వం చూసుకుంటారని, అందరం ఏకతాటిపై నడుస్తామని భూమా చెప్పారు.రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్ర పురోగతికి కచ్చితమైన నాయకత్వ నిర్ణయాలుండాలని, అలాంటి స్పష్టత వైకాపాలో కనిపించలేదని ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. ఆరేడు నెలల కిందటే పార్టీ మారాల్సి ఉన్నా కొంత ఆలస్యం జరిగిందన్నారు.

రాయలసీమ అభివృద్ధిపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రికి విన్నవించానని తెలిపారు. పట్టిసీమ రాయలసీమకు పట్టుసీమని, అందులో అవినీతి జరిగిందనటం అవాస్తవమని చెప్పారు. అమరావతి శంకుస్థాపనకు జగన్‌ రాకపోవటం అన్యాయమన్నారు. ఆయన ఆలోచనా ధోరణి సరిగాలేదని వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని పడగొడతానంటూ జగన్‌ ప్రకటించడం చాలా తప్పన్నారు. దీనిని నిరసిస్తూనే అభివృద్ధికి సహకరించాలనే ఉద్దేశంతో తాము తిరుగుబాటు చేశామని చెప్పారు. ఇది మొదటి తిరుగుబాటని, ఇంకా చాలా మంది ఎదురు తిరిగేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఎంతమంది వీలైతే అంతమంది బయటకు వస్తారన్నారు.

English summary
YSR Congress Party MLAs Bhuma nagi Reddy and Akhila and other 2 MLAs joined in Telugudesam Party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X