కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చెప్పాల్సిన టైంలో చెప్తా: టిడిపిలో చేరికపై భూమా, రాజీనామాపై ట్విస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీలో చేరుతారన్న ఊహాగానాల పైన నంద్యాల ఎమ్మెల్యే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూమా నాగిరెడ్డి సోమవారం నాడు స్పందించారు. ఆయన ఉదయం పిఎసి సమావేశానికి హాజరయ్యారు. అనంతరం పిఎసి చైర్మన్‌గా రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది.

అనంతరం ఆయన విలేకరులతో పిచ్చాపాటిగా మాట్లాడారు. టిడిపిలో చేరుతున్నారా అని విలేకరులు ఆయనను ప్రశ్నించారు. దానికి ఆయన మాట్లాడుతూ.. చెప్పాల్సిన సమయంలో అంతా చెబుతానని అన్నారు. అయితే, టిడిపిలో చేరిక విషయమై రోజులా, గంటలా అనేది వేచి చూడాలని చెప్పారు. పీఏసీ ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేయలేదని చెప్పారు.

Also Read: కెసిఆర్ సక్సెస్, చంద్రబాబు ఫెయిల్: ఎందుకు?

దయచేసి నన్ను అర్థం చేసుకోవాలన్నారు. మీకు (మీడియా) చెప్పకుండా నేను ఏ నిర్ణయం తీసుకోనని చెప్పారు. ప్రతి ఒక్కటి మీడియాకు చెప్పి నిర్ణయం తీసుకుంటానని వ్యాఖ్యానించారు. టిడిపిలో చేరే విషయమై ఆయన ఎక్కడా ఖండించలేదు.

Bhuma Nagi Reddy resigns to PAC chairman post, to join Telugudesam

మీకు మీడియా కంగ్రాట్స్ చెబుతోందనగా... ఆయన నవ్వుతూ వెళ్లిపోయారు. ఎప్పుడు అనేది సస్పెన్స్‌లో పెట్టినప్పటికీ... భూమా నాగిరెడ్డి, అఖిల ప్రియ టిడిపిలో చేరడం మాత్రం ఖాయమని తేలింది. పిఎసి చైర్మన్ పదవికి రాజీనామా చేయడంతో ఆయన టిడిపిలోకి వెళ్లడం ఖాయమని అంటున్నారు.

సాయంత్రం చంద్రబాబును కలవనున్న భూమా

భూమా నాగిరెడ్డి సోమవారం సాయంత్రం ఏపీ సీఎం చంద్రబాబును కలవనున్నారని తెలుస్తోంది. ఈ నెల 26న లేదా 27వ తేదీన భూమా టిడిపిలో చేరే అవకాశముందని తెలుస్తోంది. కాగా, భూమా టిడిపిలోకి వెళ్లడాన్ని వైసిపి జీర్ణించుకోలేకపోతోంది. జగన్ ఇంట్లో లాంటి వ్యక్తి భూమా అని, అలాంటి వ్యక్తి టిడిపిలోకి వెళ్లడం ఏమిటని అంటున్నారు.

భూమా మనసులో ఏముంది?

టిడిపిలో చేరే విషయమై భూమా పూర్తి స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో భూమా మనసులో ఏముందనే విషయమై చర్చ సాగుతోంది. ఆయన మనసులో ఏముందో తెలియక.. ఇటు టిడిపి, అటు వైసిపిలో ఉత్కంఠ కనిపిస్తోందని అంటున్నారు. టిడిపిలో చేరడంలేదని స్పష్టంగా చెప్పలేదు. అలాగని చేరుతానని చెప్పలేదు.

మరో పదిమంది ఎమ్మెల్యేలు

భూమాతో పాటు ఎమ్మెల్యే జలీల్ ఖాన్, మరో విజయనగరం ఎమ్మెల్యే కూడా సైకిల్ ఎక్కవచ్చునని అంటున్నారు. భూమాకు మంత్రి పదవి ఖాయమని తేలింది. వైసిపికి చెందిన దాదాపు పదిమంది ఎమ్మెల్యేలు టిడిపిలోకి రావొచ్చునని చెబుతున్నారు. వీరికి ఏ పదవులు ఇవ్వాలనే విషయమై చంద్రబాబు తర్జన భర్జన పడుతున్నట్లుగా తెలుస్తోంది.

English summary
YSR Congress Party Bhuma Nagi Reddy resigns to PAC chairman post, to join Telugudesam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X