టీటీడీపై భూమన కుట్ర.. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం: హోం మంత్రి అనిత

టిటిడి ఆధ్వర్యంలో ఉన్న ఎస్ వి గోశాలలో మూడు నెలల్లో 100 గోవులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాయని టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే అత్యంత పవిత్రక్షేత్రమైన తిరుమలలో టీటీడీ నిర్లక్ష్యం కారణంగా మహా పాతకం చోటుచేసుకుందని ఆయన అన్నారు . మూడు నెలల్లోనే వందకు పైగా గోవులు అనుమానాస్పద స్థితిలో మృత్యువాత పడ్డాయని తెలిపారు.

టీటీడీపై భూమన ఆరోపణలు, ఖండించిన టీటీడీ చైర్మన్
దీనిపైన ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. భూమన వ్యాఖ్యలను టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు ఖండించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే మచ్చలు వేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. టిటిడి ఇటీవల కాలంలో చేస్తున్న మంచి పనులు చూసి కంటగింపుతో ఈ తరహా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ప్రజలు వీటిని నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

Bhumana conspiracy against TTD Will take legal action Home Minister Anitha

భూమన వ్యాఖ్యలపై మండిపడిన హోం మంత్రి అనిత
తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుపైన వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారని హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. తిరుమల గోశాలలో 100 ఆవులు చనిపోయాయని ఆయన చేసిన వ్యాఖ్యలను వంగలపూడి అనిత ఖండించారు. కావాలని టీటీడీ పైన కుట్రలు చేస్తున్నారని అసత్య ప్రచారాలతో టిటిడి ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని అనిత మండిపడ్డారు.

Take a Poll

టీటీడీ ఖజానాను దారి మళ్లించి కమిషన్లు తీసుకున్న భూమన
టీటీడీకి సంబంధించిన ఎస్ వి గోశాలలో 260 మంది సిబ్బంది గో సంరక్షణ పనులు చేస్తున్నారని వంగలపూడి అనిత పేర్కొన్నారు. అక్కడ ఉన్న సుమారు 2668 ఆవులకు జియో ట్యాగ్ చేసి మరీ పర్యవేక్షిస్తున్నారు అని వంగలపూడి అనిత వెల్లడించారు. భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ ఖజానాను దారి మళ్లించి కమిషన్లు కొట్టేసాడు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

చట్టపరమైన చర్యలు తీసుకుంటాం
తిరుమల ఏడుకొండలు ఐదు కొండలుగా మార్చేందుకు కుట్ర చేశాడని, తిరుమలలో అన్యమత ప్రచారం జరగటానికి కారణం ఆయనేనని, ఆయన పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వంగలపూడి అనిత పేర్కొన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి టిటిడి పైన చేసిన ఆరోపణలలో ఏ మాత్రం నిజం లేదన్నారు వంగలపూడి అనిత.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+