తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సమైక్య తీర్మానం: భూమన, తమిళనాడులో కలపాలని..

By Srinivas
|
Google Oneindia TeluguNews

Bhuamana Karunakar Reddy
చిత్తూరు: సమైక్యాంధ్రప్రదేశ్ పైన తాము రేపు వాయిదా తీర్మానం ఇస్తామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి బుధవారం అన్నారు. సమైక్యంపై రేపు చర్చకు రాకుంటే తాము ఎల్లుండి ప్రయివేటు బిల్లు పెడతామన్నారు. సమైక్య రాష్ట్రంపై అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిందేనన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పైన అవిశ్వాసం పెట్టేందుకు తమకు తగినంత బలం లేదని, ఎవరైనా పెడితే ఆలోచిస్తామని చెప్పారు.

చంద్రబాబుపై కొణతాల

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విభజనపై రోజుకో మాట చెబుతున్నారని, మీడియా సమావేశాలకే ఆయన పరిమితమయ్యారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత కొణతాల రామకృష్ణ విమర్శించారు. బాబు విభజన ప్రక్రియను ఆపే ప్రయత్ం చేయడం లేదన్నారు. ఆర్టికల్ 3 పై చేస్తున్న పోరాటంలో తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ విజయం సాధించారన్నారు. రాష్ట్ర విభజన అంశంలో అందరు కలిసి వస్తే రాజకీయ సంక్షోభం సృష్టించవచ్చుననన్నారు.

తమిళనాడులో కలపాలని దీక్ష

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని లేదంటే తమను తమిళనాడు రాష్ట్రంలో కలపాలని చిత్తూరు జిల్లాలో తమిళనాడు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. తమిళనాడు సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో పలువురు తమిళులు బుధవారం రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని వారు డిమాండ్ చేశారు. విభజన అనివార్యమైతే మాత్రం తమను తమిళనాడులో కలపాలని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా నుండి ఇప్పటి వరకు ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నా ఒరిగిందేమీ లేదన్నారు. తమ మొదటి డిమాండ్ సమైక్యాంధ్రనే అన్నారు. విడగొడితే మాత్రం తమిళనాడులోనే కలపాలన్నారు.

English summary
YSR Congress Party Tirupati MLA Bhuamana Karunakar Reddy on Wednesday demanded Assembly resolution for Samaikyandhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X