తుని విధ్వంసం: భూమనను 7 గంటలు విచారించిన సిఐడి
అమాయకులను వేధించడంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దిట్ట అని వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకరరెడ్డి విమర్శించారు. రెండో రోజు ఏడు గంటల విచారణ ముగిసిన తర్వాత అనంతరం బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. అధికారులకు కావాల్సిన సమాచారాన్ని అడిగారని, తనకు తెలిసింది చెప్పానని అన్నారు. తాను ఎవరికీ భయపడనని, ఏ తప్పూ చేయనని చెప్పారు. బీసీ రిజర్వేషన్ తక్షణం అమలు చేయాలని, ముఖ్యమంత్రి తన చిత్తశుద్ధిని చూపాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications