భూమన కరుణాకరరెడ్డి సీఐడీ విచారణ
తుని ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత భూమన కరుణాకరరెడ్డి సీఐడీ విచారణ ముగిసింది. భూమనను 8 గంటలకు పైగా సీఐడీ అధికారులు విచారించారు. విచారణ అనంతరం బయటకు వచ్చిన భూమన మీడియాతో మాట్లాడుతూ తుని ఘటనతో తనకెలాంటి సంబంధం లేదన్నారు.
తాను తప్పు చేయలేదని, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. తుని ఘటనలో విచారించాల్సింది తనను కాదని చంద్రబాబును ప్రశ్నించాలన్నారు. తుని ఘటనలో తనను కావాలనే వేధిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. తనపై ప్రభుత్వం కక్ష సాధిస్తోందని ఆరోపించారు.












Click it and Unblock the Notifications