టీటీడీలో వెయ్యి మంది అన్యమత ఉద్యోగులు ఉన్నారా- అసలు లెక్క ఏంటి..!?

తిరుమల తిరుపతి దేవస్థానంలో పని చేస్తున్న అన్య మతస్థులు ఎంత మంది. తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ టీటీడీలో వెయ్యి మంది అన్య మతస్థులు పని చేస్తున్నారని.. వారిని వెంటనే తెలిగించాలని టీటీడీని డిమాండ్ చేసారు. టీటీడీలో ఇతర మతస్థులకు అవకాశం ఉండకూడదని తేల్చి చెప్పారు. కాగా.. వెయ్యి మంది అన్యమతస్థులు ఉన్నారనే లెక్కల పైన ఇప్పుడు చర్చ మొదలైంది. ఇదే అంశం పై టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కీలక వ్యాఖ్యలు చేసారు.

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేసారు. టీటీడీలో వెయ్యి మంది అన్య మతస్థులు పని చేస్తున్నారని.. అసలు వారికి అవకాశం ఎలా ఇచ్చారని నిలదీసారు. వారిని వెంటనే తెలిగించాలని తాను కోరటం లేదని.. డిమాండ్ చేస్తున్నాన ని తేల్చి చెప్పారు. గతంలో టీటీడీ పాలక వర్గం సమావేశంలోనూ అన్య మతస్థులను వీఆర్ఎస్ లేదా ఇతర ప్రభుత్వ శాఖలకు రిలీవ్ చేయటం పైన చర్చ జరిగింది. ప్రభుత్వం వద్ద ప్రతిపాదన లు చేసింది. కాగా, ఇప్పుడు బండి సంజయ్ కామెంట్స్ తో ఏకంగా వెయ్యి మంది టీటీడీలో అన్య మతస్థులు పని చేస్తున్నారనే లెక్కపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మాజీ ఛైర్మన్ భూమన ఈ వ్యవహారం పైన స్పందించారు.

bhumana-kaurnakar-reddy-seriously-reacts-on-bandi-sanajay-recent-comments

బండి సంజయ్ చెప్పిన అన్య మతస్థుల లెక్క పైన టీటీడీ అధికారులు స్పష్టత ఇవ్వాలని భూమన డిమాండ్ చేసారు. కేంద్ర మంత్రిగా ఉండి ఇలా ప్రకటన చేసారంటే వారి వద్ద నివేదిక ఉందా అని ప్రవ్నించారు. టిటిడి బోర్డు 22 మంది అన్య మతస్తులు ఉన్నారని, వారిని బదిలీ చేస్తున్నట్లు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసారు. టిటిడి ఈఓ, చైర్మన్ లు దీనిని ప్రకటించారని వివరించారు.

మరి బండి సంజాయ్ 1000 మంది అన్య మతస్తులు ఉన్నట్లు చెప్పడం భక్తుల మనోభావాలను దెబ్బతీయ‌డమేనని వ్యాఖ్యానించారు. తిరుమలపై ఇంత పెద్ద నింద‌ ఎలా వేస్తార ని ప్రశ్నించారు. బండి సంజ‌య్ ప్రకటన ప్రకారం టిటిడి లో 20 శాతం పైగా అన్య మతస్తులే ఉన్నట్టు అర్థమని పేర్కొన్నారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిన బాధ్య‌త కూటమి ప్రభుత్వం, టిటిడీ పై ఉందన్నారు. టిటిడి ని, టిటిడి ఉద్యోగస్తులను అవమానించడమేని భూమన పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+