సీసీ కెమెరాలతో బాగోతం, రంగా హత్య నీవల్లే: బాబును దులిపిన భూమన
తిరుపతి: కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామికి వైభవం తెచ్చింది తానే అన్నట్లుగా ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడారని, ఆయన మాటలతో అన్నమయ్య మరుగుజ్జుగా మారిపోయారని, హిందూ ధార్మికత పైన చంద్రబాబు చావుదెబ్బ కొట్టారని వైసిపి నేత భూమన కరుణాకర్ రెడ్డి సోమవారం మండిపడ్డారు.
భగవంతుడి పట్ల దారుణమైన అపచారం చేసేలా చంద్రబాబు వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. మూడు రోజుల మహానాడులో టిడిపి నేతలు తమ పార్టీ అధినేత వైయస్ జగన్ నామస్మరణ చేశారన్నారు. బాబు నయవంచన, అవినీతి బయటపడుతుందనే జగన్ పైన విమర్శలు అన్నారు.
ఎన్టీఆర్ ఆశయాలను సమాధి చేసి ఆయన చావుకు కారణమైన చంద్రబాబు అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం పెడతానని చెప్పడం విడ్డూరమన్నారు. తన అవినీతిని నిరూపిస్తే జైలుకు వెళ్తానని లోకేష్ చెప్పడం ఆశ్చర్యకరమన్నారు. చంద్రబాబు ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్‌గా దొరకలేదా అని ప్రశ్నించారు.

లోకేష్ బాబును సూటుకేసు బాబుగా ఏపీ ప్రజలు పిలుస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కార్యాలయం, ఇంట్లో సీసీ కెమెరాలు పెడితే ఆయన బాగోతం బయటపడుతుందన్నారు. మహానాడులో పచ్చిబూతులు మాట్లాడారని మండిపడ్డారు.
వంగవీటి రంగా హత్యకు కారకుడైన చంద్రబాబు హత్యా రాజకీయాల గురించి మాట్లాడటం హాస్యాస్పదం అన్నారు. హరిరామజోగయ్య తన పుస్తకంలో చంద్రబాబు పాత్ర గురించి రాశారన్నారు. కుల రాజకీయాలు, కుల పిచ్చితో చంద్రబాబు పైకి వచ్చారన్నారు.
తనకు ఉన్న కుల పిచ్చిని ఎస్వీయులో అందరికీ వ్యాపింప చేశారన్నారు. చంద్రబాబులా అబద్దాలు చెప్పే దుర్మార్గుడు ఈ ప్రపంచంలోనే ఎవరూ లేరన్నారు. అవసరమైతే ఎవరి కాళ్లైనా పట్టుకునే అమీబా జాతి వ్యక్తి అన్నారు. త్వరలో వైసిపి ఖాళీ అవుతుందని చంద్రబాబు చెప్పిన మాటల వెనుక కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. రాజ్యసభ ఎన్నికల కోసం ఒక్కో ఎమ్మెల్యేకు రూ.40 కోట్లు ఇస్తారట అన్నారు.












Click it and Unblock the Notifications