భోగాపురం ఎయిర్‌పోర్ట్ పై నారా భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు!
భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం చేసి జాతికి అంకితం చేసింది కూటమి ప్రభుత్వం. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక అయిన ఎయిర్ పోర్ట్ రాకతో ఆ ప్రాంత రూపు రేఖలు మారుతున్నాయి. ఎప్పటినుండో ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి లేదని చర్చ జరుగుతున్న వేళ కూటమి సర్కార్ అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తుంది.
భోగాపురం నుంచి విశాఖపట్నానికి ప్రయాణ సమయంపై పెద్ద చర్చ
భారీ పరిశ్రమలు, పర్యాటక ప్రాజెక్ట్ లు ఆ ప్రాంతానికి వస్తున్నాయి. ఈ క్రమంలో భోగాపురం నుంచి విశాఖపట్నానికి ప్రయాణ సమయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. భోగాపురం నుండి విశాఖ ప్రయాణం చాలా ఆలస్యం అవుతుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ చర్చపైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి స్పందించారు.

సాధారణ మార్గంలోనే ప్రయాణించి 45 నిమిషాల్లో విశాఖ చేరుకున్నానన్న భువనేశ్వరి
తాను సాధారణ మార్గంలోనే ప్రయాణించి 45 నిమిషాల్లో విశాఖ చేరుకున్నట్లు ట్వీట్ చేశారు. కొంతమంది భోగాపురం నుంచి విశాఖపట్నానికి రెండు గంటల సమయం పడుతుందని చెబుతున్నారని గమనించానని ఆమె తెలిపారు. అయితే తన స్వయం అనుభవం ప్రకారం అంత సమయం పట్టడం లేదని స్పష్టం చేశారు. అనకాపల్లికి 1 గంట 10 నిమిషాలు పట్టిందని కూడా చెప్పారు.
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో తొలిసారి అడుగుపెట్టడం ఆనందం
ప్రయాణికులు బయలుదేరే ప్రాంతం, ట్రాఫిక్ పరిస్థితులు, మార్గాన్ని బట్టి సమయం మారవచ్చని అభిప్రాయపడ్డారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో తొలిసారి అడుగుపెట్టడం ఆనందంగా ఉందని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. విమానాశ్రయంలో కలంకారి డిజైన్లు, సాంప్రదాయ కళలు, బొబ్బిలి వీణ, తెలుగు ఇంటి ముగ్గులు ఆంధ్రప్రదేశ్ సంస్కృతిని ప్రతిబింబిస్తున్నాయని ప్రశంసించారు. ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు ముఖ్యమైన మైలురాయిగా, అవకాశాల ముఖద్వారంగా మారుతుందని ఆమె అన్నారు.
కనెక్టివిటీ మెరుగుపడితే ప్రయాణం మరింత సులభమవుతుందన్న భువనేశ్వరి
ఆగస్టు 1న ప్రధాని మోదీ ప్రారంభించిన ఈ ఎయిర్‌పోర్ట్ నుంచి 17న వాణిజ్య విమానాలు ప్రారంభమయ్యాయి. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో కమర్షియల్ సర్వీసులు నిలిపివేయడంతో ప్రయాణికులు భోగాపురం వైపు మళ్లుతున్నారు. ఆర్టీసీ ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు కూడా నడుపుతోంది. కనెక్టివిటీ మెరుగుపడితే ప్రయాణం మరింత సులభమవుతుందని భువనేశ్వరి అభిప్రాయపడ్డారు. భవిష్యత్ లో ఈ ఎయిర్ పోర్ట్ కు మరింత మెరుగైన రవాణా సౌకర్యాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని భువనేశ్వరి అభిప్రాయం వ్యక్తం చేశారు.













Click it and Unblock the Notifications