ఓ గాడ్.. జస్ట్ మిస్.. హౌరా ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం !
అహ్మదాబాద్ నుంచి హౌరా జంక్షన్ మధ్య నడిచే హౌరా ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన గూడూరు రైల్వే జంక్షన్ పరిధిలో చోటు చేసుకుంది. తిరుపతి జిల్లాలోని గూడూరు అడవయ్య కాలనీ ప్రాంతంలో రైలు పట్టాలు విరిగాయి. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే లోకో పైలట్‌ను అప్రమత్తం చేశారు. రెడ్ క్లాత్ ద్వారా లోకోపైలట్‌ను సునీల్ అనే వ్యక్తి అప్రమత్తం చేశాడు. దాంతో ఆయన రైలును నిలిపివేశారు. పట్టాలు విరగడంతో ఆ మార్గంలో సుమారు గంటపాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఇక రైల్వే అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు.
ఇక ఈ రైలు అహ్మదాబాద్ నుంచి ఉదయం 00:15 గంటలకు బయలుదేరి మూడవ రోజు మధ్యాహ్నం 13:30 గంటలకు హౌరా జంక్షన్ చేరుకుంటుంది. దాదాపు 2,087 కిలోమీటర్ల దూరాన్ని 37 గంటల 15 నిమిషాల్లో పూర్తి చేస్తుంది. ఈ ప్రయాణంలో గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ సహా పలు రాష్ట్రాల గుండా వెళ్తుంది.













Click it and Unblock the Notifications