విజయసాయి రెడ్డికి జగన్ బిగ్ టాస్క్ - సక్సెస్ అయ్యేనా..!!
ఏపీ ఎన్నికల రాజకీయాల్లో కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. గెలుపే లక్ష్యంగా వైసీపీ, టీడీపీ -జనసేన కూటమి కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన అభ్యర్దుల తొలి జాబితాను ప్రకటించాయి. బీజేపీతో పొత్తు పైన స్పష్టత వచ్చిన తరువాతనే ఎంపీ స్థానాలు ప్రకటించాలని భావిస్తున్నాయి. ఈ సమయంలోనే వైసీపీ రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి టీడీపీలో చేరుతున్నారు. నెల్లూరు ఎంపీగా పోటీ చేయనున్నారు. దీంతో, జగన్ ఆయన పైన పోటీ కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు.
నెల్లూరుకు సాయిరెడ్డి : నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్దిగా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిని జగన్ ఖరారు చేసారు. సరిగ్గా వేమిరెడ్డి టీడీపీలో చేరటానికి కొన్ని గంటల ముందు ఈ నిర్ణయం తీసుకున్నారు. విజయ సాయిరెడ్డి ఇప్పటి వరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. అదే విధంగా టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తారని చెబుతున్న వేమిరెడ్డి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగలేదు. ఇద్దరూ రాజ్యసభ సభ్యులే. ఇద్దరూ నెల్లూరు జిల్లాలో ఆర్దికం గా బలవంతులు. ఒకరి బలాలు - బలహీనతల పైన మరొకరికి పూర్తి స్పష్టత ఉంది. సాయిరెడ్డిని ప్రస్తుత ఎన్నికల్లో గుంటూరు, పల్నాడు పర్యవేక్షణ బాధ్యతలు చూడాలని జగన్ నిర్దేశించారు. కానీ, వేమిరెడ్డి పార్టీ మార్పు నిర్ణయంతో నెల్లూరు ఎంపీగా బరిలోకి దింపాలని నిర్ణయించారు.

రెండు పార్టీలకు ప్రతిష్ఠాత్మకం : విజయసాయి రెడ్డి తొలి నుంచి వైసీపీ నెల్లూరు జిల్లాల ఇంఛార్జ్ గా ఉన్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి నెల్లూరు పార్లమెంట్ కు జరిగిన ఒక ఉప ఎన్నిక, రెండు సార్వత్రిక ఎన్నికల్లొనూ వైసీపీ అభ్యర్దులే విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది. కొద్ది కాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో జిల్లాలో సమీకరణాలు మారిపోయాయి. జిల్లా నుంచి ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి చేరారు. అందులో ఇప్పటికే కోటంరెడ్డికి టీడీపీ నుంచి నెల్లూరు రూరల్ ఖాయమైంది. ఆనంకు సైతం ఆత్మకూరు లేదా సర్వేపల్లి సీటు ఇస్తారని తెలుస్తోంది. ఇక..ఈ ఎన్నికల్లో రాజ్యసభ పదవీ కాలం పూర్తి కావటంతో వేమిరెడ్డిని నెల్లూరు ఎంపీగా బరిలోకి దింపాలని జగన్ నిర్ణయించారు. అందుకు అన్ని ఏర్పాట్లు జరిగాయి.

సాయిరెడ్డి వర్సస్ వేమిరెడ్డి : కానీ, తాను సూచించిన విధంగా సీట్ల మార్పు చేయకపోవటంతో వేమిరెడ్డి పార్టీ మారాలని నిర్ణయించారు. టీడీపీ నుంచి ఎంపీగా బరిలోకి దిగటానికి సిద్దమయ్యారు. దీంతో, జగన్ అలర్ట్ అయ్యారు. నెల్లూరు స్థానం ఇప్పుడు సీఎం జగన్ కు ప్రతిష్ఠాత్మకంగా మారింది. అక్కడ ఎంపీగా ఎవరిని నిలబెట్టాలని కసరత్తు చేసారు. వేమిరెడ్డి ఆర్దికంగా బలమైన అభ్యర్ది కావటంతో సాయిరెడ్డిని పోటీకి దింపాలని డిసైడ్ అయ్యారు. సాయి రెడ్డికి పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో కింది స్థాయి నేతల వరకు సత్సంబంధాలు ఉండటం కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. తాజా రాజకీయ పరిణామాలతో టీడీపీలోనూ ఈ స్థానం పైన అంచనాలు పెరిగాయి. దీంతో, వేమిరెడ్డి వర్సస్ సాయిరెడ్డిగా మారుతున్న నెల్లూరు రాజకీయంలో గెలుపెవరనేది ఆసక్తి కరంగా మారుతోంది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications