వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇళ్ల పట్టాలపై జగన్ సర్కార్ కు ఊరట-సాయిరెడ్డి ట్వీట్-కుట్రలన్నీ పటాపంచలంటూ..

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ సర్కార్ పేదలకు ఇళ్ల స్ధలాల్ని నదీ ప్రవాహాల్ని మార్చేలా కేటాయిస్తోందంటూ జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ)కి పలు ఫిర్యాదులు అందాయి. వీటి వెనుక టీడీపీ నేతలు ఉన్నారంటూ వైసీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయా చోట్ల ఇళ్ల పట్టాల కేటాయింపు నిలిచిపోయింది. తాజాగా దీనిపై ఎన్జీటీ స్పందించింది. ఏపీలో ఇళ్ల పట్టాల వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది.

ఇళ్ల పట్టాల కేటాయింపు నదీ ప్రవాహాల్ని మార్చేలా ఉందంటూ అందిన ఫిర్యాదులపై స్పందించిన ఎన్జీటీ.. ఈ వ్యవహారంలో జోక్యానికి నిరాకరించడంతో టీడీపీ పన్నిన కుట్రలు పటాపంచలు అయ్యాయంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ ట్వీట్ చేశారు. అంతే కాదు ఎన్జీటీ ఉత్తర్వుల ఆధారంగా టీడీపీని, చంద్రబాబును టార్గెట్ చేస్తూ మరిన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతో సాయిరెడ్డి ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

big relief to jagan regime as ngt refuse to intervene in house sites issue-vijayasai tweet

పేదలకు ఇళ్ల పట్టాలు కేటాయిస్తూ నదీ ప్రవాహాలు మారిపోతాయా ? కరకట్టను కబ్జా చేసి బంగ్లాలు కట్టుకుంటే నదులను పరిరక్షించినట్లా చంద్రబాబూ అంటూ తన ట్వీట్ లో విజయసాయిరెడ్డి టీడీపీ అధినేతను ప్రశ్నించారు. తద్వారా ఉండవల్లి కరకట్టపై చంద్రబాబు అక్రమ నివాసం ఆరోపణల్ని మరోసారి తెరపైకి తెచ్చారు.

ఇప్పటికే వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు లీజుకు తీసుకుని నివసిస్తున్న ఇంటిని టార్గెట్ చేసింది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర కృష్ణానదికి ప్రవాహం సముద్రంలోకి వెళ్లేలా గేట్లు ఎత్తకుండా తన ఇంటి ముంపుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ చంద్రబాబు కూడా గతంలో ఆరోపణలు చేశారు.

English summary
ysrcp mp vijayasai reddy tweeted on ngt orders refused to intervene in ap house sites issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X