రఘురామకు భారీ ఊరట-జగన్ సర్కార్ కు హైకోర్టు కీలక ఆదేశం- నరసాపురం ఎంట్రీ సుగమం ?
వైసీపీతో విభేదిస్తున్న ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఇవాళ హైకోర్టులో భారీ ఊరట దక్కింది. రఘురామకృష్ణంరాజుపై వైసీపీ సర్కార్ నమోదుచేసిన కేసుల నేపథ్యంలో అరెస్టు భయంతో ఢిల్లీకే పరిమితం అవుతున్న రఘురామ ఎన్నికల వేళ సొంత నియోజకవర్గం నరసాపురానికి తిరిగొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో ముందడుగు పడింది. ఈ మేరకు హైకోర్టు జగన్ సర్కార్ కు కీలక ఆదేశాలు జారీ చేసింది.

వైసీపీ వర్సెస్ రఘురామ పోరు
ఏపీలో వైసీపీ తరఫున నరసాపురం నంచి ఎంపీగా గెలిచి, ఆరు నెలలకే ఆ పార్టీతో విభేదించడం మొదలుపెట్టిన కనుమూరు రఘురామకృష్ణంరాజుకు ఆ తర్వాత వరుస కష్టాలు మొదలయ్యాయి. నరసాపురం పరిధిలోకి వచ్చే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో కేసులు పెట్టిన వైసీపీ సర్కార్.. వాటిపై విచారణకు సిద్దమైంది. దీంతో హైదరాబాద్, ఢిల్లీలోనే ఉండటం మొదలుపెట్టిన రెబెల్ ఎంపీ.. మధ్యలో ఓసారి సీఐడీ అరెస్టు చేసి గుంటూరు తెచ్చినా వేధింపుల నేపథ్యంలో తిరిగి సుప్రీంకోర్టును ఆశ్రయించి ఢిల్లీకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఢిల్లీలోనే ఉంటున్న రఘురామ.. మధ్యలో ఏపీకి వచ్చేందుకు పలుసార్లు విఫలయత్నం చేశారు.

హైకోర్టును ఆశ్రయించిన రఘురామ
తనపై వైసీపీ సర్కార్ నమోదు చేసిన కేసుల వివరాలను కూడా రఘురామరాజు తెలుసుకునే పరిస్దితి లేకుండా పోయింది. ఏపీలో తనపై నమోదైన కేసుల వివరాలు, ఎఫ్ఐఆర్ కాపీలు ఇవ్వాలని డీజీపీకి రఘురామరాజు లేఖ రాశారు. అయినా స్పందన రాకపోవడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.తనపై ప్రభుత్వం నమోదు చేసిన కేసుల వివరాలు కూడా ఇవ్వడం లేదంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దీంతో తనను ఏ కేసులో అరెస్టు చేస్తారో తెలియడం లేదని హైకోర్టు దృష్టికి తెచ్చారు. రఘురామ తరఫున న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. తన పిటిషనర్ ను నియోజకవర్గానికి వచ్చేందుకు అవకాశం ఇవ్వకుండా అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఉమేష్‌చంద్ర వాదించారు. ప్రభుత్వం తరపున హోంశాఖ న్యాయవాది వాదనలు వినిపించారు. చివరికి ఉమేష్ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది.

హైకోర్టు కీలక ఆదేశం
రఘురామ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు ఇచ్చింది. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పై ఉన్న ఎఫ్‌ఐఆర్ లు, రిజిస్టర్ కాని ఫిర్యాదులు వివరాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. చట్టపరంగా తనకున్న హక్కులను ఉపయోగించుకునేందుకు రఘురామకృష్ణరాజుకు అవకాశం ఉందని హైకోర్టు పేర్కొంది. దీంతో రఘురామకృష్ణరాజు పై ఉన్న ఎఫ్‌ఐఆర్‌లు, రిజిస్టర్ కాకుండా ఉన్న వివరాలు కూడా వెంటనే అందించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాద్ రాయ్ ఆదేశాలు ఇచ్చారు.

రఘురామ నరసాపురం ఎంట్రీకి మార్గం సుగమం ?
ఇవాళ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో రఘరామరాజు తన నియోజకవర్గం నరసాపురంలో తిరిగి అడుగుపెట్టేందుకు కొంతకాలంగా చేస్తున్న ప్రయత్నాలకూ ఊతం లభించినట్లయింది. అయితే పూర్తిగా మాత్రం కాదు. ఎందుకంటే హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో హోంశాఖ ఇప్పుడు రఘురామపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. వాటిపై ఆయన న్యాయపోరాటం చేసేందుకు వీలు కలుగుతుంది. వాటిలో ఆయన గెలిస్తే నరసాపురం ఎంట్రీకి మార్గం సుగమం అయినట్లే. అసలే ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఓ ప్రజాప్రతినిధిగా ఆయన విజ్ఞప్తిని హైకోర్టు మన్నించే అవకాశాలు కూడా ఉంటాయి. దీంతో ఆయనకు ఊరట లభించినట్లుగా భావించవచ్చు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications