Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Amaravati : అమరావతిలో జగన్ కు భారీ ఊరట ! మరో గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం..

ఏపీలో అమరావతి స్ధానంలో మూడు రాజధానుల వ్యవహారం తెరపైకి వచ్చినప్పటి నుంచి రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. అదే సమయంలో అమరావతిలోనూ పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో అమరావతిలో జగన్ సర్కార్ ఏ చిన్న నిర్ణయం తీసుకున్నా దానిపై వివాదాలు కూడా చెలరేగాయి. ఇలాంటి సమయంలో అమరావతి రాజధానిలో జగన్ సర్కార్ తీసుకున్న ఓ కీలక నిర్ణయానికి కేంద్రం ఆమోదముద్ర వేసింది. హైకోర్టు ఆదేశాలతో సంబంధం లేకుండా కేంద్రం ఈ నిర్ణయం ప్రకటించింది.

అమరావతి ఆర్ 5 జోన్ లో పేదలకు ఇళ్ల స్ధలాలు కేటాయిస్తూ వైసీపీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని గతంలో అక్కడి స్దానికులు వ్యతిరేకించినా, విపక్షాలు కోర్టులకు వెళ్లినా హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా దీనిపై ప్రభుత్వానికి అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చాయి. అలాగే ఇళ్ల పట్టాల పంపిణీ తర్వాత అక్కడ పేదలకు ఇళ్ల నిర్మాణం కూడా వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్న వేళ కేంద్రం మాత్రం ఆమోదముద్ర వేస్తూ కీలక నిర్ణం తీసుకుంది.

big relief to ys jagan as centre gives nod to houses construction in amaravati r5 zone

తాజాగా ఢిల్లీలో జరిగిన సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో అమరావతి ఆర్ 5 జోన్ లో పేదలకు 47 వేల ఇళ్ల నిర్మాణానికి ఆమోదముద్ర వేస్తూ కేంద్రం నిర్ణయించింది. గతంలో వైసీపీ ప్రభుత్వం నుంచి అందిన ప్రతిపాదన మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. జగన్ సర్కార్ అడిగిన నెల రోజుల్లోపే కేంద్రం దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. వాస్తవానికి హైకోర్టు, సుప్రీంకోర్టులు గతంలో అమరావతిలో తుదితీర్పుకు లోబడి ఇళ్ల పట్టాల కేటాయింపు, వాటిలో ఇళ్ల నిర్మాణం ఉంటుందని చెప్పాయి. అయితే కేంద్రం మాత్రం అవేవీ పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఊరటనిచ్చేలా ఈ ఇళ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది.

అమరావతి ఆర్5 జోన్ లో పేదలకు 47 వేల ఇళ్ల నిర్మాణం కోసం మొత్తం రూ.705 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇందులో ఒక్కో ఇంటి నిర్మాణానికి కేంద్రం రూ.1.5 లక్షలు ఇవ్వనుండగా.. రాష్ట్రం రూ.30 వేలు ఖర్చు చేయబోతోంది. ఇప్పుడు కేంద్రం ఈ మొత్తం ఇచ్చేందుకు అంగీకారం తెలపడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా వేగంగా అడుగులు వేయబోతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+