వైసీపీకి బిగ్ షాక్.. కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్ట్!

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి రెండు నెలలుగా పరారీలో ఉన్న విషయం తెలిసిందే. క్వార్ట్జ్ మైనింగ్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆయనపైన పోలీసులు కేసు నమోదు చేశారు .ఈ కేసు నమోదైన తర్వాత కొంతకాలం పాటు కూటమి ప్రభుత్వ పాలన పైన తీవ్ర విమర్శలు చేశారు కాకాణి గోవర్ధన్ రెడ్డి.

కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్ట్?
కాకాణి ఇదే సమయంలో బెయిల్ కోసం కూడా విఫలయత్నాలు చేశారు. ఆయనకు హైకోర్టులో చుక్కెదురైంది. దీంతో కాకాణి గోవర్ధన్ రెడ్డిని అరెస్టు చేయాలని పోలీసులు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఆయన అదృశ్యమయ్యారు. ఇక గత రెండు నెలలుగా తప్పించుకు తిరుగుతున్న కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేసినట్టు వార్తలు వస్తున్నాయి.

Is kakani govardhan reddy arrested by ap police in kerala

కాకాణిని పట్టుకోవటం కోసం రంగంలోకి పోలీస్ బృందాలు
గత కొంతకాలంగా కాకాణి గోవర్ధన్ రెడ్డిని పట్టుకోవడం కోసం పోలీసులు కాకాణి బంధువుల ఇళ్ళు, ఫామ్ హౌస్లలో గాలిస్తున్నారు. పోలీసుల నోటీసులు తీసుకోకుండా విచారణకు రాకుండా ఆయన తప్పించుకు తిరుగుతున్నారు. హైదరాబాదులో కొంతకాలం, బెంగళూరులో కొంతకాలం, ఇలా తప్పించుకుని తిరుగుతున్నట్టు గుర్తించి ఆయన కోసం పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.

కాకాణిని బెంగళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు?
హైదరాబాద్లో రెండు బృందాలు కాకాణి కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి. మరోవైపు బెంగళూరులోనూ ఆయన కోసం ఆయన సన్నిహితుల, బంధువుల అందరి ఇళ్ళను పోలీసులు జల్లెడ పట్టారు. ఇక కాకాణి గోవర్ధన్ రెడ్డి కి సంబంధించి కూపీ లాగుతూ గాలింపు చేపట్టిన ఎట్టకేలకు ఆయనను కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో అరెస్టు చేసినట్టు తెలుస్తుంది. కాకాణి గోవర్ధన్ రెడ్డి క్వార్ట్జ్ కేసులో a4 గా ఉన్నారు. మొత్తం ఈ కేసులో మరో 12 మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు.

కాకాణి ని ఏపీకి తీసుకువస్తున్న పోలీసులు
అయితే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఈ కేసుకు సంబంధించి కోర్టులో బెయిల్ పొందే ప్రయత్నాలు చేశారు. కానీ బెయిల్ కోసం ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇక తనను అరెస్టు చేస్తారని భావించిన క్రమంలోనే కాకాణి గోవర్ధన్ రెడ్డి పరారయ్యారు. దీంతో ఆయనను పట్టుకోవడానికి హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాలలో తనిఖీలు చేసిన పోలీసులు, ఎట్టకేలకు కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో ఆయనను అరెస్ట్ చేసినట్లు సమాచారం. గుంటూరు రేంజ్ పోలీసులు కాకాణిని అదుపులోకి తీసుకుని ఏపీకి తీసుకువస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+