Vizag Railway Zone: వైజాగ్ రైల్వే జోన్ పై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..!

ఏపీకి విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చిన కీలక హామీల్లో వైజాగ్ రైల్వే జోన్ కూడా ఒకటి. ఈ హామీకి పదేళ్లు నిండిపోయినా ఇంకా మోక్షం కలగలేదు. దీనికి కర్ణుడి చావుకి ఉన్నన్ని కారణాలు ఉన్నాయి. వీటిలో ఏపీ ప్రభుత్వం భూకేటాయింపు కూడా ఒకటి. గతంలో వైసీపీ ప్రభుత్వం వైజాగ్ రైల్వే కోసం ఇచ్చిన భూమిపై కేంద్రం అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ రైల్వే జోన్ ఏర్పాటు చేయలేదు. దీంతో ఇప్పుడు కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

వైజాగ్ రైల్వే జోన్ హామీ అమలుపై సీఎం చంద్రబాబు రైల్వే మంత్రి అశ్వీనీ వైష్ణవ్ తో తాజాగా మరోసారి చర్చలు జరిపారు. ఇందులో వైజాగ్ రైల్వే జోన్ ఏర్పాటుకు అవసరమైన, తగిన భూమిని ఇస్తే ముందుకెళ్తామని సూచించారు. దీంతో చంద్రబాబు కూడా అందుకు అంగీకరించారు. గతంలో వైసీపీ ఇచ్చిన భూమి ముంపు ప్రాంతంలో ఉందని, దాని స్ధానంలో మరో భూమి ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. త్వరలో ఈ భూమిని రైల్వేశాఖకు అప్పగిస్తారు.

big step for vizag railway zone establishment as Chandrababu agreed to allot land in new area

వైజాగ్ రైల్వే జోన్ ఏర్పాటు విషయంలో ఏపీ-ఒడిశా మధ్య కూడా సమస్యలు ఉన్నాయి. వైజాగ్ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం గతంలో అంగీకరించింది. అయితే ఇప్పటికే ఉన్న తూర్పు కోస్తా రైల్వే జోన్ నుంచి వైజాగ్ ను తొలగిస్తే తమకు ఇబ్బందులు తప్పవని ఒడిశా వాదిస్తోంది. అసలే ఒడిశాకు చెందిన అశ్వినీ వైష్ణవ్ రైల్వేమంత్రిగా ఉండటంతో ఈ సమస్యను ఆయన ఎలా అధిగమిస్తారన్నది చూడాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+