విజయవాడ రాజకీయంలో కీలక మలుపు - కేశినేని వర్సస్ పీవీపీ..!!

విజయవాడ రాజకీయంలో కీలక మలుపు. కొద్ది రోజులుగా టీడీపీ ఎంపీ కేశినేని వ్యవహారం పార్టీలో వివాదాస్పదంగా మారుతోంది. వైసీపీ నేతలను ప్రశంసిస్తూ..సొంత పార్టీ నేతల పైన కేశినేని చేస్తున్న వ్యాఖ్యలు పార్టీలో కలకలంగా మారాయి. కేశినేని నాని ఇక పార్టీ వీడటం ఖాయమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇదే సమయంలో వైసీపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన పీవీపీ వరుసగా కేశినేని నానిని టార్గెట్ చేస్తూ.. పరోక్షంగా టీడీపీకి మద్దతుగా చేస్తున్న ట్వీట్లతో ఈ వ్యవహారం కొత్త టర్న్ తీసుకుంటోంది.

కేశినాని టార్గెట్ వెనుక : కేశినేని నాని పార్టీ నేతల పైన వరుసగా సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు. పార్టీ ఇంఛార్జ్ లను గొట్టాంగాళ్లు అంటూ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీసాయి. తనను మహానాడుకు పార్టీ ఆహ్వానించలేదని నాని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఇండిపెండెంట్ గా గెలిపిస్తారేమో అంటూ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. వైసీపీ నుంచి వచ్చిన ఆఫర్ పైనా స్పందించారు.

 kesineninanipvp

తనను పొమ్మనకుండా పొగ పెడుతున్నారని.. మండటం పెరిగితే ఆఫర్ల గురించి ఆలోచన చేస్తానని నాని వ్యాఖ్యానించారు. దీంతో..కేశినేని నాని ఇక పార్టీలో ఉండరని సొంత పార్టీలోని ప్రత్యర్ధులు అంచనాకు వచ్చారు. నాని వ్యాఖ్యల మీద స్పందించకుండా వేచి చూడాలనే ఆలోచనలో పార్టీ నేతలు ఉన్నారు. కేశినేని నాని వరుసగా వ్యాఖ్యలు చేస్తున్నా పార్టీ హైకమాండ్ స్పందించలేదు.

నాని పై పీవీపీ ట్వీట్ల యుద్దం : ఇదే సమయంలో గత ఎన్నికల్లో కేశినేని నాని పైన వైసీపీ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసిన పీవీపీ స్పందించారు. గతంలోనూ కేశినేని వ్యాఖ్యల పైన సీరియస్ వ్యాఖ్యలు చేసిన పీవీపీ..ఇప్పుడు మరోసారి నాని పార్టీ మార్పు పైన ట్వీట్ చేసారు. అందులో.." బెజవాడ భల్లూకమా..నీకు చిరెత్తితే చిరిగేది నీ చాట,వుడేది నీ ప్యాంటు..నువ్వేదో మహా ప్రతివ్రతని అంటూ నువ్వు చూపే సోయగాలకు సొంగలు కార్చే విటులు విజయవాడలో ఎవ్వరు లేరు,

ఈ ఎండల్లో కారెక్కుతావో, కమలం జ్యూస్ తాగుతావో లేక ఫ్యాన్ ఏసుకుంటావో ... రాబోయే నీ దుర్ధినం.. మా అందరి సుదినం..అంటూ పోస్టు చేసారు. పీవీపీ తాజాగా నందమూరి బాలయ్య జన్మదినం నాడు చేసిన శుభాకాంక్షల ట్వీట్ కూడా ప్రస్తుతం వైరల్ అవుతోంది.

కేశినేని రూటు ఎటు : పీవీపీ తన ట్వీట్ లో కేశినేని నాని ఇక వైసీపీలో..లేకుంటే బీజేపీలో చేరుతారనే విధంగా పరోక్షంగా కామెంట్స్ చేసారు. ఈ వరుస ట్వీట్లు చూసిన తరువాత పీవీపీ టీడీపీ వైపు చూస్తున్నారా అనే చర్చ మొదలైంది. టీడీపీ నేతలు ఎవరూ స్పందించకపోయినా..పీవీపీ వరుసగా కేశినేని నాని పైన సెటైర్లతో ట్వీట్లు చేయటం..టార్గెట్ చేయటం వెనుక అసలు లక్ష్యం ఏంటనే చర్చ మొదలైంది.

రానున్న ఎన్నికల దిశగా కసరత్తు ప్రారంభమైన వేళ విజయవాడ కేంద్రంగా రాజకీయం ఆసక్తి కర మలుపులు తీసుకుంటోంది. దీంతో, కేశినేని నాని ఈ ట్వీట్ పైన ఎలా స్పందిస్తారో..రాజకీయంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+