Bigg Boss6: ఏంటీ అశ్లీలత.. బిగ్ బాస్ షోపై ఏపీ హైకోర్టు సీరియస్..
బిగ్ బాస్-6పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. షోలో అశ్లీలతపై హైకోర్టు సీరియస్ అయింది. ఈ అశ్లీలత ఏంటని ఉన్నతన్యాయస్థానం ఘాటుగా స్పందించింది. 1970ల్లో ఎలాంటి సినిమాలు వచ్చాయో తెలుసు కదా అని గుర్తు చేసింది. బిగ్‌బాస్‌లో అశ్లీలత ఎక్కువగా ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది శివప్రసాద్ రెడ్డి వాదన వినిపించారు.

ఐబీఎఫ్ గైడ్‌లైన్స్ పాటించడం లేదని వినిపించారు. దీనిపై స్పందించడానికి కేంద్రం తరఫు న్యాయవాది కోరారు. వాదనలు న్యాయస్థానం తదుపరి విచారణను అక్టోబర్ 11కు వాయిదా వేసింది. బిగ్ బాస్ షో పై ఇప్పటికే చాలా విమర్శలు ఉన్నాయి. ఎమ్మెల్యే రాజాసింగ్, సీపీఐ నారాయణ బిగ్ బాస్ లో జరుగుతున్న దానిపై విమర్శలు చేశారు.












Click it and Unblock the Notifications