విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రైళ్లలో బీహార్, హర్యానా కేటుగాళ్లు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: బీహార్, హర్యానా రాష్ట్రాలకు చెందిన దొంగల ముఠా సభ్యులు ఏడుగురిని ఇక్కడి రైల్వే పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వీరిలో బీహార్‌కు చెందినవారు ఐదుగురు, హర్యానాకు చెందినవారు ఇద్దరుండగా, నిందితుల నుంచి దాదాపు 22 లక్షల రూపాయల విలువైన 600 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.

విశాఖ రైల్వేపోలీసు స్టేషన్‌లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో డిఎస్‌పి పి నారాయణరావు ఆ వివరాలను వెల్లిడించారు. వీరికి 11 కేసులతో సంబంధం ఉందని తెలిపారు. గోదావరి, సింహాద్రి రైళ్ళల్లోనూ కాకినాడ పాసింజర్‌లోనూ దొంగతనాలకు పాల్పడి తప్పించుకుతిరుగుతున్న బీహార్‌లోని మాదుపూర్ మండలం తొలబారి గోవింద్‌పూర్ గ్రామానికి చెందిన దీపక్ మండల్, భాలగాల్‌మూర్ జిల్లా భమార్‌పూర్ ప్రాంతానికి చెందిన బాబ్‌బామ్‌కుమార్, కజ్‌ఛాక్ గ్రామానికి చెందిన విశాల్‌కుమార్, గోవింద్‌పూర్‌కు చెందిన బుగ్గాకుమార్, అభిషేక్ నిషాద్‌లను అరెస్టు చేశామని చెప్పారు.

వీరితోపాటు హర్యానా కలయాత్ గ్రామానికి చెందిన రాజేందర్, హన్స్‌రాజ్‌లను అరెస్టు చేశామని, నిజానికి హర్యానాకు చెందిన ఆరుగురి ముఠా సభ్యులు 11 కేసులతో సంబంధాలు కలిగి ఉండగా, ఇందులో వీరిద్దర్ని పట్టుకున్నట్టు చెప్పారు. అరెస్టయనవారంతా 20 నుంచి 35 ఏళ్ళ లోపు వయస్సు కలిగిన వారేనన్నారు.

రైళ్లలో కేటుగాళ్లు

రైళ్లలో కేటుగాళ్లు

దొంగల ముఠా నుంచి దాదాపు 22 లక్షల రూపాయల విలువైన 600 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనపర్చుకున్నామని డిఎస్పీ పి నారాయణ రావు చెప్పారు.

రైళ్లలో కేటుగాళ్లు

రైళ్లలో కేటుగాళ్లు

ఏసి కోచ్‌లు, స్లీపర్ తరగతి కోచ్‌ల్లో ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని ఈ ముఠా సభ్యులు చోరీలకు పాల్పడుతుంటారని డిఎస్పీ చెప్పారు.

రైళ్లలో కేటుగాళ్లు

రైళ్లలో కేటుగాళ్లు

బెర్త్ పైభాగంలోను, కింద భాగంలో కూర్చొనే వీరు ప్రయాణికుల కదలికలను గమనిస్తూ అవకాశం కోసం నిరీక్షిస్తుంటారని, ఈ విధంగా ఏదైనా రైల్వేస్టేషన్ సమీపించే సమయంలో ప్రయాణికుల వద్దనుండే బ్యాగ్‌లు, సూట్‌కేసులను ఎత్తుకుపోతుంటారని నారాయణ రావు చెప్పారు.

రైళ్లలో కేటుగాళ్లు

రైళ్లలో కేటుగాళ్లు

ముఠా సభ్యుల దగ్గర ప్రయాణికుల తరహాలోనే బ్యాగ్‌లుంటాయని, వీటితోపాటే వాటిని దొంగిలిస్తారని వివరించారు. కాగా, కిలో బంగారు ఆభరణాలు చోరీ చేయగా, ఇందులో దాదాపు 600 గ్రాములను ప్రస్తుతం స్వాధీనం చేసుకోగలిగామని డిఎస్పీ చెప్పారు.

రైళ్లలో కేటుగాళ్లు

రైళ్లలో కేటుగాళ్లు

హైక్లాస్ ప్రయాణికులను ఈ ముఠా సభ్యులు లక్ష్యం చేసుకుని, దొంగతనాలకు పాల్పడుతూ ఉంటారు. ఆ ముఠాను పట్టుకున్నట్లు చెప్పారు.

రైళ్లలో కేటుగాళ్లు

రైళ్లలో కేటుగాళ్లు

మొత్తం రెండు ముఠాలకు సంబంధించి కొంతమేర బంగారు ఆభరణాలను స్వాధీనపర్చుకున్నట్టు నారాయణ రావు తెలిపారు. ఈ సమావేశంలో జిఆర్‌పి సిఐ కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

English summary
Haryana and Bihar gangs nabbed Visakhapatnam railway police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X