వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీహార్ గ్యాంగ్ టెక్నిక్: రూపాయి నాణెంతో రైల్వే సిగ్నల్ మార్చి రాబరీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఒంగోలు: మూడు రోజుల క్రితం చెన్నై - హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌లో చోరీ జరిగింది. దొంగలు నిద్రిస్తున్న మహిళా ప్రయాణికురాలి మెడలో నుండి 24 గ్రాముల బంగారు గొలుసును దొంగిలించారు. కాగా, ఈ దొంగతనానికి పాల్పడింది బీహార్ ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు.

ప్రభుత్వ రైల్వే పోలీసు అధికారులు బీహార్ ముఠా పైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బీహార్ గ్యాంగ్ ఈ దొంగతనానికి పాల్పడి ఉంటుందని భావిస్తున్నామని, వారు ఒక్క రూపాయి కాయిన్‌ను ఉపయోగించి రైల్వే సిగ్నల్స్‌ను మార్చారని, ఇలాగే పలు రాష్ట్రాల్లో చేశారని పోలీసులు చెబుతున్నారు.

Bihar gang stop trains with Rupee 1 coins

బీహార్ నుండి పలువురు పనివారు కాంట్రాక్ట్ బేసిస్‌లో రైల్వే ట్రాక్ మెయింటెనెన్స్‌లో పని చేసేందుకు వస్తుంటారు. వారికి వాటి గురించి పూర్తిగా తెలిసి ఉంటుందని, టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుందని చెప్పారు. రూపాయి కాయిన్ ఉపయోగించి వారు సిగ్నల్స్ చేయించే చేస్తారన్నారు.

బీహార్ ముఠాకు చెందిన వారు గతంలో ఢిల్లీలో ఇదే విధంగా.. రూపాయి నాణెం ఉపయోగించి సిగ్నల్‌ను మార్చి నిద్రిస్తున్న మహిళ గొలుసును లాక్కెళ్లారని చెప్పారు. అయితే, ఏపీలో మాత్రం ఇలా జరగడం ఇదే తొలిసారి అని చెప్పారు.

English summary
Government railway police officials suspect the involvement of a Bihar gang in the robbery that took place on the Chennai-bound Hyderabad-Chennai Express, in which robbers snatched a 24-gram gold chain from a sleeping woman passenger.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X