'బీహార్'తో చంద్రబాబుని చిక్కుల్లో పెట్టిన మోడీ, భయపడ్తున్నారని బొత్స
హైదరాబాద్: బీహార్‌కు ప్రధాని నరేంద్ర మోడీ భారీ ప్యాకేజీ ప్రకటించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక హోదా వేడి రాజుకుంది. ఈ నెల 20వ తేదీన సిఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్నారు. హోదా విషయంలో చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తున్నామని కాంగ్రెస్, వైసిపిలు ప్రకటించాయి.
ప్రత్యేక హోదా, ఇతర హామీలను సాధించుకు రావాలని వారు విజ్ఞప్తి చేశారు. బీహార్ రాష్ట్రానికి ప్రధాని మోడీ మంగళవారం నాడు రూ.1.65 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రాజెక్టులకు సాయంగా రూ.40వేల కోట్లు, ప్యాకేజీ రూ.1.25 కోట్లు ప్రకటించారు. దీంతో, ఏపీలో విపక్షాలు హోదాపై ప్రశ్నిస్తున్నాయి.
బీహార్‌కు రూ.1.65 లక్షల ప్యాకేజీ ఇచ్చారు: బొత్స
ప్రత్యేక హోదాను అడగడానికి సిఎం చంద్రబాబు భయపడుతున్నారని వైసిపి నేత బొత్స సత్యనారాయణ అన్నారు. బీహార్ రాష్ట్రానికి రూ.1.65వేల కోట్ల ప్యాకేజీ ఇచ్చారని గుర్తు చేశారు. ఏపీకి చంద్రబాబు ప్యాకేజీ ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు.

చంద్రబాబు విఫలం: ఉమ్మారెడ్డి
ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ తేవడంలో చంద్రబాబు విఫలమయ్యారని వైసిపి నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. కేంద్రంలో ఒత్తిడి తేలేకపోతున్నారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు కేంద్రం ముందు తాకట్టు పెట్టారన్నారు.
ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ ఈ నెల 29న తమ పార్టీ తలపెట్టిన బందుకు ప్రజలంతా సహకరించాలన్నారు. హోదా కోసం మిగిలిన రాజకీయ పార్టీలను కలుపుకొని తాము ముందుకు పోతామన్నారు. రాజకీయాలకతీతంగా బందు ఉంటుందని, అందరూ విజయవంతం చేయాలన్నారు.
హోదా విషయంలో చంద్రబాబుకు సహకరిస్తామని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి, వైసిపి నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. అదే సమయంలో హోదా తేవడంలో విఫలమయ్యారని, ఢిల్లీ వెళ్తున్నందున ఆయనకు మద్దతుగా నిలుస్తున్నామని చెప్పారు.












Click it and Unblock the Notifications