జోక్యం చేసుకోలేం: ఆళ్లకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం మంగళగిరి సమీపంలోని నాలుగు గ్రామాల్లో చేపట్టిన భూసేకరణ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలంటూ ఆయన దాఖలుచేసిన వ్యాజ్యాన్ని సుప్రీం కొట్టేసింది.
ప్రస్తుత పరిస్థితుల్లో ఈ అంశంపై జోక్యం చేసుకోలేమని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ అమితవరాయ్ లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. హైకోర్టులో విచారణ పూర్తయ్యాక తమ వద్దకు రావాలని సూచించింది.

కాగా, 2013 భూసేకరణ చట్టం సరిగా అమలు కావడం లేదని మూడు పంటలు పండే భూములను నోటిఫై చేయకుండా భూసేకరణ చేట్టారని ఆళ్ల రామకృష్ణారెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications